BigTV English

Allu Arjun : బన్నీ ఫ్యాన్స్‌కు షాక్… ఇక నుంచి ‘అల వైకుంఠపురంలో’ మూవీని చూడలేం

Allu Arjun : బన్నీ ఫ్యాన్స్‌కు షాక్… ఇక నుంచి ‘అల వైకుంఠపురంలో’ మూవీని చూడలేం

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన మూవీ ‘అల వైకుంఠపురం’ (Ala Vaikuntapurramuloo)లో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్న దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ బన్నీ అభిమానులకు షాక్ ఇచ్చింది. రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో ‘అల వైకుంఠపురం’లో మూవీ అందుబాటులో ఉండబోదని సమాచారం. మరి ఈ మూవీని చూడాలనుకునే వారు ఏ ఓటీటీలో చూడొచ్చు? ఎందుకు నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని డిలీట్ చేస్తోంది ? అనే వివరాల్లోకి వెళితే…


మూవీని డిలీట్ చేయడానికి ఇదే కారణమా ?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సుశాంత్, టబు, పూజాహెగ్డే తదితరులు కీలకపాత్రలు పోషించిన మూవీ ‘అల వైకుంఠపురంలో’. తమన్ ఈ మూవీకి సంగీతం అందించగా, అల్లు అరవింద్ – రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాతోనే బన్నీ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే . 2020 జనవరి 13న ఈ మూవీ సంక్రాంతి కానుకగా, థియేటర్లలోకి వచ్చింది. అయితే ఓటీటీలో మాత్రం 2020 ఫిబ్రవరి 27న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి గత ఐదేళ్లుగా నాన్ స్టాప్.గా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ మూవీ 2025 ఫిబ్రవరి 27 వరకు మాత్రమే నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డిలీట్ చేయబోతున్నారు. ఒక మూవీని దాదాపు 5 ఏళ్ల పాటు స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంచడం అనేది ‘అల వైకుంఠపురంలో’ మూవీ విషయంలోనే ఫస్ట్ టైం అయ్యి ఉండొచ్చు. ఇక ఫిబ్రవరి 27 తర్వాత ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు.


‘అల వైకుంఠపురంలో’ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చు?

నెట్ ఫ్లిక్స్ ‘అల వైకుంఠపురంలో’ మూవీని డిలీట్ చేయడం అన్నది బన్నీ అభిమానులకు బ్యాడ్ న్యూస్. కానీ ఈ సినిమాను ఆ తర్వాత ఎక్కడ చూడొచ్చు అనే గుడ్ న్యూస్ కూడా ఉంది. నెట్ ఫ్లిక్స్ డిలీట్ చేసినా, సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుంది. కాబట్టి బన్నీ అభిమానులు డోంట్ వర్రీ.

ఇదిలా ఉండగా త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. త్వరలోనే ఈ కాంబోలో ‘ఏఏ 22’ అనే మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రూపు దిద్దుకోబోతోంది. గత ఏడాది ‘పుష్ప 2’ మూవీతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ నెక్స్ట్ త్రివిక్రమ్, అట్లీ ప్రాజెక్ట్ లలో భాగం కాబోతున్నారు. మరి ఈ రెండు సినిమాలలో పట్టాలు ఎక్కబోయే ఫస్ట్ మూవీ ఏది అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ రెండూ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నట్టు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×