Paytm IRCTC Booking: ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం ఇండియన్ రైల్వేకు సంబంధించి బోలెడు సర్వీసులను అందిస్తున్నది. వినియోగదారులు ఫ్లాట్ ఫారమ్ టికెట్లతో పాటు అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు, తత్కాల్ టికెట్లు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. PNR స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ట్రైన్ కరెంట్ రన్నింగ్ స్టేటస్ ను కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్లాట్ ఫారమ్ టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఇన్ స్టంట్ రీఫండ్ ను అందిస్తుంది.
పేటీఎం ద్వారా రైలు టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే?
⦿ముందుగా పేటీఎం అధికారిక వెబ్ సైట్ https://paytm.com/train-tickets ను ఓపెన్ చేయాలి.
⦿లేదంటే పేటీఎం అధికారిక యాప్ ఓపెన్ చేయాలి.
⦿మీరు ఎక్కడికి వెళ్లాలో డేట్ సహా సెలెక్ట్ చేసుకోవాలి. లాగిన్ కావాలి.
⦿ఆ తర్వాత సెర్చ్ బటన్ ను ట్యాప్ చేయాలి. మీరు ఆ రూట్ లో అందుబాటులో ఉన్న రైళ్ల వివరాలు కనిపిస్తాయి.
⦿మీకు అనుకూలంగా ఉన్న రైలును సెలెక్ట్ చేసుకుని నచ్చిన క్లాస్ లో అందుబాటులో ఉన్న టికెట్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ఆ తర్వాత బుక్ బటన్పై క్లిక్ చేయాలి.
⦿అనంతరం మీ IRCTC లాగిన్ ఐడీని ఎంటర్ చేయాలి.
⦿యాప్లో అడిగిన డీటైల్స్ ఫిల్ చేసిన తర్వాత బుక్ బటన్ పై క్లిక్ చేయాలి.
⦿ఆ తర్వాత డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, పేటీఎం వ్యాలెట్ ద్వారా పేమెంట్ చేయాలి.
⦿పేమెంట్ కంప్లీట్ కాగానే రైలు టికెట్ బుక్ అవుతుంది.
⦿మీ ఈ మెయిల్ తో పాటు ఫోన్ కు ఈ టికెట్ వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి.
పేటీఎం ‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ ఫీచర్
ఇక రద్దీ సీజన్లలో టికెట్లు బుక్ చేసుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతారు. ముఖ్యంగా పండుగల సీజన్ లో టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. చాలా వరకు వెయిటింగ్ లిస్టు ఉంటుంది. ఈ నేపథ్యంలో పేటీఎం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ పేరుతో కచ్చితంగా కన్ఫార్మ్ టికెట్లను అందిస్తున్నది. ఈ విధానం ద్వారా కచ్చితంగాధృవీకరించిన సీటును పొందవచ్చు.ఈ ఫీచర్ ప్రయాణీకులకు పండుగ సమయాల్లో టికెట్ దొరకదేమో అనే టెన్షన్ తగ్గిస్తుంది.
పేటిఎం లో కన్ఫార్మ్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
కన్ఫామ్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి ‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ను ఉపయోగించాలి.
⦿ముందుగా పేటీఎం యాప్ ను ఓపెన్ చేయాలి. మీరు వెళ్లే రూట్ కు సంబంధించి రైళ్లను సెర్చ్ చేయాలి.
⦿మీరు సెలెక్ట్ చేసుకున్న రైలు టికెట్ వెయిటింగ్ లిస్టులో కనిపిస్తే ‘ఆల్టర్నేటివ్ స్టేషన్’ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿దగ్గర్లోని స్టేషన్లలో అందుబాటులో ఉన్న టికెట్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
⦿ఆ తర్వాత టికెట్ ను సెలెక్ట్ చేసుకుని, బుక్ చేసుకోవచ్చు.
‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ ద్వారా కచ్చితంగా కన్ఫార్మ్ టికెట్ పొందే అవకాశం ఉంటుంది.
Read Also: కాశ్మీర్ వందే భారత్‌కు ముహూర్తం ఫిక్స్.. టికెట్ ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?