BigTV English

Nitish Kumar Reddy : RCBలాగే మేమూ ప్లేఆఫ్స్ చేరుతాం.. డేంజర్ బెల్స్ పంపిన తెలుగోడు

Nitish Kumar Reddy : RCBలాగే మేమూ ప్లేఆఫ్స్ చేరుతాం.. డేంజర్ బెల్స్ పంపిన తెలుగోడు

Nitish Kumar Reddy :  ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు చెత్త ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 3 మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 2 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా 2 మ్యాచ్ ల్లో విజయం సాధించి చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. నిన్న రాత్రి చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. దీంతో కాస్త మెరుగుపడింది హైదరాబాద్.


Also Read : Kavya Maran: హర్షల్ పటేల్ ను బండ బూతులు తిట్టిన కావ్య.. కమిందును కూడా !

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించడంతో పలువురు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఆటగాడు నితీశ్ రెడ్డి మాట్లాడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆప్స్ కి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 7 మ్యాచ్ లు గెలిచి ప్లే ఆప్స్ కి చేరింది. ప్రారంభంలో 8 మ్యాచ్ లకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించింది ఆ జట్టు. ఆ తరువాత పుంజుకొని ప్లే ఆప్స్ కి వెళ్లింది. ఈ సారి మేము కూడా అలాగే చేరుకుంటామని.. ఇందుకోసం 100 శాతం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆ తరువాత ఏం జరుగుతుందో చూద్దామని తెలిపారు. ప్రస్తుతం పాయింట్ల ప్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్లే ఆప్స్ కి చేరాలంటే మాత్రం 5 మ్యాచ్ లకు 5 మ్యాచ్ లు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. అప్పుడే సన్ రైజర్స్ కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది. లేదంటే.. ప్లే ఆప్స్ కి వెళ్లకుండానే ఇంటిముఖం పట్టే అవకాశం ఉంటుంది.


ఇక నిన్న రాత్రి హైదరాబాద్ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ ని పరిశీలించినట్టయితే.. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులు మాత్రమే చేయ గలిగింది. చెన్నై జట్టు చివరి 5 ఓవర్లకు కేవలం 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో తక్కువ స్కోర్ కే పరిమితమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. హర్షల్ పటేల్ 4 వికెట్లు తీసుకొని అద్భుతమైన బౌలింగ్ వేశాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. హైదరాబాద్ జట్టు మధ్యలో కాస్త తడబడిన చివరి వరకు పోరాడి విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ అన్ని మ్యాచ్ ల్లో గెలుస్తుందని.. దూకుడుగా ఆడితేనే ఆటగాళ్ల అత్యుత్తమ ఆట బయటికీ వస్తుందని.. కోచ్ వెటోరీ పేర్కొనడం విశేషం.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×