Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. నాలుగేళ్ల క్రితం రిలీజ్ అయిన పుష్ప బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా మార్చింది. నేషనల్ అవార్డును తీసుకొచ్చిపెట్టింది. ఇక బన్నీ సైతం ఈ సినిమా కోసమే నాలుగేళ్లు కష్టపడ్డాడు.
వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు పుష్ప 2 డిసెంబర్ 5 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను మరింత పెంచింది. సాధారణంగా పుష్ప 2 పై మొదటి నుంచి అందరూ పాజిటివ్ టాక్ నే అనుకుంటూ వచ్చారు. కానీ, బన్నీ ఈ ఏడాది ఎలక్షన్స్ లో చేసిన ఒకే ఒక్క పని.. మొత్తాన్ని మార్చేసింది. పుష్ప 2 అంటేనే మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Pushpa 2 Pre – release event: రాజమౌళి మాటను ఫాలో అయిన పుష్ప.. రాజమౌళి ఏమన్నారు అంటే..?
ఎలాగైనా హిట్ కొడతామని అల్లు ఫ్యాన్స్.. అసలు మెగా ఫ్యాన్స్ లేకుండా ఎలా కొడతారో చూస్తామని మిగతా ఫ్యాన్స్ ట్రోల్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇక బన్నీ సైతం ప్రమోషన్స్ మొత్తాన్ని తన ఒంటిచేత్తో లాక్కోస్తున్నాడు. రాష్ట్రాలన్నీ తిరిగి.. సినిమాపై హైప్ పెంచుతున్నాడు. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. బన్నీనే స్పెషల్ గెస్ట్ అనుకునే సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి.. గెస్ట్ గా విచ్చేసి షాక్ ఇచ్చాడు. అయితే ఆయన ఎందుకు వచ్చాడు.. ? ఎవరి కోసం వచ్చాడు.. ? అనేది పక్కన పెడితే మొక్కుబడిగా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు.
ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న హీరోయిన్స్ వీరే..
ఇక ఇదంతా ఒక సైడ్ జరుగుతుంటే.. ఇంకోసైడ్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కొంతమంది ఫ్యాన్స్.. సాంగ్ కు డ్యాన్స్ వేస్తూనే.. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. అయితే వారు ఊగేదాని బట్టి చూస్తూనే మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. ఇక కిస్సిక్ సాంగ్ కు కొంతమంది కుర్రాళ్లు డ్యాన్స్ వేస్తుండగా.. ఏమి చేయకుండానే వారిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. వెంటనే చుట్టూ ఉన్నవారు కూడా ఒకరికొకరు కాలర్స్ పట్టుకొని గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఆ వ్యక్తి ఎవరు.. ? ఏమి చేయకుండా ఎందుకు దాడికి పాల్పడ్డాడు.. ? మద్యం మత్తులో ఉన్నాడా.. ? లేక దాడి చేయడానికే అక్కడకు వచ్చాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.