BigTV English

Mega VS Allu : “ఫేక్ పనులు”… మళ్లీ మొదలైన అల్లు vs మెగా పంచాయితీ

Mega VS Allu : “ఫేక్ పనులు”… మళ్లీ మొదలైన అల్లు vs మెగా పంచాయితీ

Mega VS Allu : ఈ రోజు ఉదయం నుంచి టాలీవుడ్‌లో ఐటీ దాడులు సంచలనాలను రేపిస్తున్నాయి. ఒకే సారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలపై వరుసగా దాడులు చేయడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలక్కిపడింది. ముఖ్యంగా దిల్ రాజు బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పైన ఐటీ అధికారులు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇలా ఐటీ రైడ్స్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో దాని ప్రభావం కనిపిస్తుంది. అటు అల్లు అభిమానులు… ఇటు మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా… ఒకరి హీరోలపై, మరొకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా వార్‌తో మరోసారి అల్లు vs మెగా అనే పంచాయితీ తెరపైకి వచ్చింది.


అల్లు vs మెగా ఇది ఇప్పటిది కాదు… “చెప్పను బ్రదర్” అంటూ అల్లు అర్జున్ ఎప్పుడైతే కామెంట్ చేశాడో… అప్పటి నుంచి ఈ పంచాయితీ నడుస్తుంది. ఎప్పుడైతే… అల్లు అర్జున్ తన ట్యాగ్ నేమ్‌ని స్టైలీష్ స్టార్ అని రిమూవ్ చేసి… ఐకాన్ స్టార్ అని పెట్టుకున్నాడో… అది కాస్త డబుల్ అయింది. ఇక రీసెంట్‌గా పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాలు రావడం, అలాగే… సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన వల్ల అది మొత్తం ముదిరిపోయింది.

గేమ్ ఛేంజర్ టాక్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఎఫెక్ట్ వల్ల అయితే కొద్ది రోజుల నుంచి అభిమానులు సైలెంట్‌గా ఉన్నారు. కానీ, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతలపై జరుగుతున్న ఐటీ రైడ్స్ మరోసారి అల్లు vs మెగా పంచాయితీకి ఆజ్యం పోసినట్టు అయింది.


సైలెంట్‌గా ఉన్న ఇండస్ట్రీని ఇలా ఐటీ రైడ్స్‌తో డిస్టర్బ్ చేసింది మీ హీరోనే అంటే మీ హీరోనే అని ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు.

పుష్ప 2 మూవీకి వచ్చిన కలెక్షన్లకు సోషల్ మీడియాలో ప్రకటించే పోస్టర్లకు అసలు సంబంధం లేదని… ఇండస్ట్రీలో టాప్‌లో ఉండాలనే ఒకే ఒక కారణంతో మైత్రీ మూవీ మేకర్స్ చేత అల్లు అర్జున్ విపరీతంగా కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేయిస్తున్నారు అని, లెక్కకు మించి పోస్టర్లు వేయడం వల్లే మైత్రీ మూవీ మేకర్స్‌పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని మెగా అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు.

ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తున్నారు. గేమ్ ఛేంజర్ కి మొదటి రోజు 51 కోట్ల కలెక్షన్లు వస్తే.. 181 కోట్ల కలెక్షన్లు వేసుకున్నారని, దాని వల్లే దిల్ రాజు ఆఫీస్ పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.

కాగా… ఈ రోజు పుష్ప 2 మూవీని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ ని ఐటీ అధికారులు… పుష్ప 2 మూవీకి పెట్టిన బడ్జెట్… ఖర్చులతో పాటు ఇప్పటి వరకు వచ్చిన లాభాల గురించి కూడా ప్రశ్నలు వేశారట.

అటు దిల్ రాజు ఆఫీస్‌లో… గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు బడ్జెట్, వస్తున్నా కలెక్షన్ల గురించి నిర్మాత దిల్ రాజును ప్రశ్నించినట్టు తెలుస్తుంది.

అయితే ఈ రెండు నిర్మాణ సంస్థలు… ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కి చూపిస్తున్న లెక్కలకు… సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కలెక్షన్ల పోస్టర్లకు పొంతన లేకపోవడంతో ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సోదాలు జరుగుతూనే ఉన్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×