Nora Fatehi:రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘బాహుబలి'(Bahubali). ఇందులో ప్రభాస్ (Prabhas) , రానా (Rana),తమన్నా(Tamannaah ) అనుష్క శెట్టి (Anushka Shetty), సత్యరాజ్(Sathyraj), రమ్యకృష్ణ (Ramyakrishna) తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించిన నోరా ఫతేహీ (Nora Fatehi) ని అంత త్వరగా ఎవరు మర్చిపోరు అనే చెప్పాలి. తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో శరీరాన్ని విల్లులా వంచుతూ.. అటు డాన్సర్లను కూడా ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. గత కొన్ని రోజులుగా యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sree Leela) రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా పేరు దక్కించుకుంటున్న బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan) పై ఫైర్ అవుతూ పలు ఊహించని కామెంట్లు చేసింది నోరా ఫతేహీ. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
నువ్వు ఎవరినైనా వదిలి పెట్టావా- నోరా ఫతేహి..
సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరో, హీరోయిన్ల మధ్య డేటింగ్ గాసిప్స్, ప్రేమాయణం నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అటు బాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో ప్రముఖ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రేమ వ్యవహారాలు నిత్యం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన..సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లతో వ్యవహారం నడిపిస్తున్నాడని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న నోరా ఫతేహీ కార్తీక్ ఆర్యన్ ను ఉద్దేశించి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ..” ఏ హీరోయిన్ నైనా నువ్వు వదిలి పెట్టావా? నీ నుండీ అసలు ఎవరైనా తప్పించుకున్నారా?” అంటూ ప్రశ్నించడంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే గతంలో కూడా నోరా ఫతేహీతో కార్తీక్ డేటింగ్ చేశాడని గాసిప్స్ వినిపించిన విషయం తెలిసిందే.
ఇంతమంది స్టార్ హీరోయిన్స్ తో కార్తీక్ ఎఫైర్ నడిపారా..
వాస్తవానికి కార్తీక్ ఆర్యన్ మొదట సారా అలీ ఖాన్ (Sara AliKhan) తో కలిసి ‘లవ్ ఆజ్ కల్ 2’ సినిమా చేశారు. ఈ సినిమా సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం కాస్త చనువుగా మారిందని రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత ‘దోస్తానా 2’ సమయంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తో కార్తీక్ పేరు బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు యంగ్ బ్యూటీ శ్రీలీలతో కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈమెతోనే కాకుండా గతంలో డింపుల్ శర్మ, తారా సుతారియా, నుస్రత్ బరుచా , అనన్య పాండే వంటి హీరోయిన్లతో కూడా ఈయనకు లింకు ఉన్నట్లు అప్పట్లో బాలీవుడ్ లో వర్గాలు జోరుగా వార్తలు వైరల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే నోరాఫతేహి ఇప్పుడు ఈ కామెంట్లు చేసింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఈ కామెంట్స్ అన్నీ కూడా కార్తీక్ ఆర్యన్ తన ఎదురుగా ఉండగానే నోరాఫతేహీ ఇలా అడగడంతో ఇక చివరికి కార్తీక్ కూడా ఆశ్చర్యపోయి సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోయారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Jabardast Comedian: విడాకుల దిశగా జబర్దస్త్ కమెడియన్.. ఇచ్చిపడేసిన భార్య..!