2026 Sankranti Movies : తెలుగు ప్రేక్షకులు ఒక సినిమాను ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా నచ్చితే ఆ సినిమాకు బ్రహ్మరథం పడతారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఒక సినిమా బాగుంది అంటే థియేటర్ వరకు వెళ్లి ఆ సినిమా హిట్ చేస్తారు. ఇక మామూలు రోజుల్లో కంటే సంక్రాంతి సీజన్ లో సినిమాలను విపరీతంగా ఆదరిస్తారు. ఫ్యామిలీతో పాటు అందరూ కలిసి సినిమా చూడటం అనేది సంక్రాంతి సీజన్ లో ఒక ఆనవాయితీగా ఎప్పటినుంచో వస్తుంది. అందుకే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రొడక్షన్ హౌస్ నుంచి ప్రతి సంక్రాంతికి ఒక సినిమా ఉండేటట్లు ప్లాన్ చేస్తూ ఉంటారు. సంక్రాంతి సీజన్లో దిల్ రాజు సినిమా వచ్చింది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. ఇక 2026 సంక్రాంతి కూడా అనేక సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
పటాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఇచ్చిన అనిల్ రావిపూడి వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు. అనిల్ రావిపూడి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఏమీ ఆలోచించకుండా థియేటర్ కు వెళ్లిపోయి హ్యాపీగా నవ్వుకోవచ్చు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్. ఈసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను చేస్తున్నాడు అనిల్. ఈ సినిమాను సంక్రాంతి కానుక విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు. అయితే మరోవైపు వెంకటేష్ తో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ ప్రాజెక్టు పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఖచ్చితంగా ఈ ఏడాది సినిమా మొదలుపెట్టనున్నాడు అనిల్. అనిల్ చిరంజీవి సినిమా సంక్రాంతికి విడుదలయితే అనిల్ దిల్ రాజుకి పోటీగా నిలబడినట్లే అని చెప్పాలి.
సెకండ్ హ్యాండ్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ లేదా మే నుంచి స్టార్ట్ కానుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇక దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంక్రాంతికి దిల్ రాజు సినిమా ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుంది. వచ్చే సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి శతమానం భవతి నెక్స్ట్ పేజ్ అనే సినిమా రిలీజ్ కానుంది. ఒకవేళ ఆ సినిమా రిలీజ్ కాకపోయినా ఆ ప్లేస్ లో మరో సినిమాను ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారు దిల్ రాజు. ఈ ప్రాజెక్ట్స్ లో ఏదీ కూడా ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు.
Also Read : Rc16 Update: బ్రేకులు , గ్యాప్ లు లేవు , రంగస్థలం రేంజ్