Rakul Preet Singh: చిన్న సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. కొద్ది కాలంలోనే దక్షిణాది హీరోయిన్స్‌లలో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది.
హిట్ ఫ్లాఫ్ అనే తేడా లేకుండా.. వరుస సినిమాలు చేస్తూ.. తన నటనతో.. తన అందాలతో ప్రేక్షకులను అలరించింది.
పల్లెటూరు అమ్మాయిలా నటించినా.. పట్నం అమ్మాయిలా చేసినా.. తాను మాత్రం తెలుగింటి ఆడపడుచులా ఉండే ముఖ కదలికలు అభిమానులను ఆకట్టుకునేలా చేసింది.
కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కన్నడ, తమిళ భాషల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఆ తర్వాత వెంకటాద్రి ఎక్సెప్రెస్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువలో అలరించింది.
నాగచైతన్యతో జోడీగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో అలరించి మంచి హిట్‌ను అందుకుంది.
ఆ తర్వాత జయ జానకి నాయిక, స్పైడర్, మన్మధుడ 2 వంటి పలు చిత్రాల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో కూడా నటించింది.
రకుల్ ప్రీత్ సింగ్ 2024 ఫిబ్రవరి 21న దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్టులో జాకీ భగ్నానీని వివాహ చేసుకుంది.
ఈ బ్యూటీ సినిమాల్లో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.
తాజాగా మాల్దీవ్స్‌లలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ.. కొన్ని ఫోటోలను Fun , family , laughter and pure joy .. this is what it feels like to be surrounded by the most important people in life ❤️ #family ❤️ అంటూ క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దగుమ్మ