Renu Desai: ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను వివాహం చేసుకొని, ఆయన నుంచీ విడిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరిని తీసుకొని ముంబైలో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జంతు ప్రేమికురాలిగా కూడా పేరు దక్కించుకున్న ఈమె.. తన సంపాదనలో కొంత భాగం జంతు సంరక్షణ కోసం కేటాయిస్తూ జీవితాన్ని కొనసాగిస్తోంది. అంతేకాదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు విషయాలపై స్పందించే ఈమె.. తాజాగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై రేణూ దేశాయ్ కామెంట్..
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఇష్టపడని ఈమె.. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి అతడి రియల్ క్యారెక్టర్ గురించి కామెంట్లు చేసింది రేణూ దేశాయ్. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా మంచిదని చెప్పుకొచ్చిన ఈమె.. ఈ సందర్భంగా తాము కలిసి నటించిన ‘జానీ’ సినిమా విశేషాలు కూడా వెల్లడించింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆ చిత్ర నిర్మాతలు నష్టపోకూడదని తన రెమ్యూనరేషన్ కూడా పవన్ కళ్యాణ్ తిరిగి ఇచ్చేసాడు. ఆయన నటించిన సినిమాలు ఏవైనా డిజాస్టర్ అయితే ఆ సినిమాల కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే సినీ ఆర్టిస్టులకు కూడా పలు సందర్భాలలో ఎంతో సహాయం చేశారు” అంటూ పవన్ కళ్యాణ్ గురించి తొలిసారి రేణు దేశాయ్ పాజిటివ్ గా కామెంట్లు చేయడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. రేణూ ఎప్పటికైనా మా వదినే అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
రేణూ దేశాయ్ కెరియర్..
ఇక రేణూ దేశాయ్ విషయానికి వస్తే.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో హీరోయిన్గా నటించి, ఆ తర్వాత అతడిని వివాహం చేసుకొని, ఇండస్ట్రీకి దూరమైంది. ఒకప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా పనిచేసింది రేణు దేశాయ్. ఇక భర్త నుంచి దూరమైన తర్వాత ఇండస్ట్రీకి కూడా దూరమైన ఈమె.. రవితేజ(Raviteja ) హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇందులో ఒక కీలక పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన ఈమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు అవకాశాలు కోసం ప్రయత్నం చేస్తోంది రేణూ దేశాయ్. తనకు సరైన పాత్ర దొరికితే ఖచ్చితంగా మళ్ళీ నటిస్తానని చెప్పిన ఈమె.. అందులో భాగంగానే కథలు కూడా వింటున్నట్లు సమాచారం. మరి ఏ మేరకు రేణూ దేశాయ్ కు సెకండ్ ఇన్నింగ్స్ కలిసి వస్తుందో చూడాలి. ఇక ఈమె కొడుకు అకీరానందన్ త్వరలో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Amitabh Bachchan: నా మరణం తర్వాత.. నా రూ.3,190కోట్ల ఆస్తి వారికే ..!