A.M Ratnam :ఒకప్పుడు శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో చిత్రాలు చేసి.. బడా నిర్మాతగా పేరు సొంతం చేసుకున్నారు ఏఎం రత్నం (A.M.Ratnam ). ‘భారతీయుడు’, ‘కర్తవ్యం’, ‘స్నేహం కోసం’, ‘ఖుషీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి, భారీ సక్సెస్ కూడా చవిచూశారు. అయితే మధ్యలో సినిమా ఇండస్ట్రీలో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన ఏ ఎం రత్నం.. ఇప్పుడు మరో పీరియాడిక్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా జూన్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏ.ఎం.రత్నం కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
అస్వస్థతకు గురైన ఏ.ఎం.రత్నం.. స్పందించిన సోదరుడు..
ఈరోజు ఉదయం తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అందులో ఏ.ఎం.రత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారని,ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు అంటూ వచ్చిన వార్త ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరిచింది. హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో ఇలాంటి మాటలు ఏంటి అంటూ అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇకపోతే ఏ ఎం రత్నం ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి అటు నెటిజన్స్ మాత్రమే కాదు ఇటు సెలబ్రిటీలు కూడా తెగ ప్రయత్నం చేస్తుండడంతో.. ఎట్టకేలకు ఆయన సోదరుడు స్పందించారు. “సోషల్ మీడియాలో అన్నయ్య ఏ.ఎం.రత్నం అస్వస్థతకు గురైయ్యారని, స్పృహ కోల్పోయారని వస్తున్న వార్తలను నమ్మకండి. ఆయన బాగానే ఉన్నారు. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేయకుండా ఉండండి “అంటూ తమ్ముడు దయాకర్ రావు (Dayakar rao) పేర్కొన్నారు.
40 బజ్జీలు అంటూ సీనియర్ ఎన్టీఆర్ పై ఏఎం రత్నం సంచలన పోస్ట్..
అయితే ఇంతలోనే మరో ఒక ట్వీట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఆ ట్వీట్ చూసిన అన్నగారి (Sr.NTR) అభిమానులు నిర్మాత ఏ.ఎం.రత్నంపై కూడా మండిపడుతున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తాజాగా ఏఎం రత్నం ఎక్స్ ఖాతా ద్వారా.. “అందరికీ నమస్కారం.. నాకు కళ్ళు తిరిగాయి అని మీడియాలో వస్తున్న మాట వాస్తవమే
అన్నగారి లాగా 40 బజ్జీలు తిని కారణజన్ముడిని అవుదామని ప్రయత్నించాను. కానీ పది బజ్జీలకే బిపి వచ్చింది. అలాంటిది ఆయన 40 బజ్జీలు ఎలా తిన్నాడోమహానుభావుడు” అంటూ నమస్కారం పెడుతున్న ఒక సంచలన పోస్ట్ దర్శనమిచ్చింది. అయితే ఇప్పుడు అది ఏ.ఎం.రత్నం ఎక్స్ ఖాతాలో దర్శనం ఇవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంచలన ట్వీట్ వెనుక అసలు రహస్యం ఇదే..
ఇకపోతే ఇలా ఉదయం నుంచి ఏం రత్నం గురించి నెగిటివ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అటు ఎన్టీఆర్ ని ఉద్దేశించి తప్పుడుగా కామెంట్లు చేశారంటూ మరో పోస్ట్ వైరల్ అవుతోంది. దీంతో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఏ.ఎం.రత్నంపై విమర్శలు గుప్పిస్తున్న వేళ.. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఆ ట్వీట్ ఫేక్ అని , ఆ అకౌంట్ నిర్మాత ఏ.ఎం.రత్నం ది కాదు అని సమాచారం. ఎవరో కావాలని ఆ ట్వీట్ వేశారు. ఇక నిజం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఇలాంటి ఫేక్ ట్వీట్స్, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వ్యక్తులను తప్పుదోవ పట్టించి, వారిపై నెగెటివిటీని పెంచే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. అంతే కాదు ఇలా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి, ఫేక్ ట్వీట్స్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం.
also read:Jr NTR : తారక్‌కు ఆ అర్హత లేదా..? ప్రశాంత్ భాయ్ ఏంటీ దారుణం..!
అంధరికీ నమస్కారం 🙏
నాకు కళ్ళు తిరిగాయి అని మీడియా లో వస్తున్నా మాట వాస్తవమే,
అన్న గారి లాగా నలభై బజ్జీలు తిని
కారణజన్ముడ్ని అవుదాం అని ప్రయత్నించా,
పది బజ్జీలకే bp వచ్చింది, అలాంటిది ఆయన నల్భై బజ్జీలు ఎలా తిన్నాడో మహానుభావుడు 🙏#HariHaraVeeraMallu— AM RATNAM (@NamanseNakitiki) May 30, 2025