Jr NTR : ఎన్టీఆర్ (NTR).. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కూడా మోస్ట్ వాంటెడ్ గానే చలామణి అవుతున్నారు. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్.. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో ఏకంగా గ్లోబల్ స్థాయిని అందుకున్నారు. ముఖ్యంగా జపాన్ లో రజినీకాంత్ (Rajinikanth ) తర్వాత అంతటి స్టార్ స్టేటస్ ను అందుకున్న ఏకైక తెలుగు యాక్టర్ ఎన్టీఆర్ కావడం ప్రశంసనీయం. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ఒకవైపు హిందీలో తన తొలి చిత్రం హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి ‘వార్ -2’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.కానీ రజనీకాంత్ ‘కూలీ’ సినిమా కూడా అదే రోజు విడుదలవుతుండడంతో.. వార్ -2 విడుదల తేదీని వాయిదా వేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అటు వార్ – 2.. ఇటు డ్రాగన్..
ఇక మరొకవైపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ టీజర్ విడుదల చేయగా.. ఇందులో ఎన్టీఆర్ కి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. పైగా హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ తేలిపోయారు. దాంతో ఎన్టీఆర్ అభిమానుల నుండి పూర్తిస్థాయిలో నెగెటివిటీ మూటగట్టుకుంది చిత్ర బృందం. అందుకే మళ్ళీ రీ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ సినిమా విడుదల తేదీ ఇంకొన్ని రోజులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు ఎన్టీఆర్ తెలుగులో ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే టైటిల్ తో పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో రుక్మిణి వసంత్ (Rukhmini Vasanth) హీరోయిన్గా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త అటు అభిమానులలో కూడా కలవరపాటుకు గురిచేస్తోంది.
ఎన్టీఆర్ సినిమాతో ప్రశాంత్ నీల్ సెంటిమెంట్ కి బ్రేక్..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , కన్నడ హీరో యష్ (Yash) తో కే జి ఎఫ్, కే జి ఎఫ్ 2 సినిమాలు చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ (Prabhas )తో ‘సలార్’ సినిమా చేసి మరో విజయం అందుకున్నారు. ఇక త్వరలో సలార్ 2 కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చి, ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అయితే ఇప్పుడు ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నారట. ఎందుకంటే ప్రశాంత్ మూవీ అంటేనే సీక్వెల్స్ అనే ముద్ర పడిపోయింది. ఎందుకంటే ఇప్పటికే కేజిఎఫ్ 1,2 నే కాదు 3 కూడా ఉందని చివర్లో చూపించారు. అటు సలార్ కూడా రెండు భాగాలుగా రాబోతుంది. ఇదే కంటిన్యూ అయితే ప్రతి కథను సిద్ధం చేయడం కష్టం కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమాను ఒకటే సినిమాగా రిలీజ్ చేసి.. ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.
తారక్ కు ఆ అర్హత లేదా..?
అయితే ఈ విషయం విన్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం.. ప్రశాంత్ భాయ్ ఏంటీ దారుణం.. తారక్ కి ఆ అర్హత లేదా..? నీ డైరెక్షన్లో తారక్ కూడా రెండు మూడు చిత్రాలు చేస్తారని మేము అనుకుంటే.. మీరు మాత్రం ఒకే సినిమాతో మీ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నారా.. మీ సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి ఎన్టీఆరే దొరికారా? అంటూ ప్రశాంత్ నీల్ పై మండిపడుతున్నారు. మరి అభిమానుల కోరిక మేరకైనా డ్రాగన్ సీక్వెల్ ఉంటుందా లేక ఒకటే మూవీ గా చేసి తన సెంటిమెంట్ కి బ్రేకులు వేస్తారా? అన్నది చూడాలి.
ALSO READ:Mahesh Babu Movie : పరమశివుడిగా మహేష్ బాబు… ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..!