Telangana Students: 2024-25 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను గడువు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం ఈ గడువు మే 31 శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగించింది. ఒకవిధంగా చెప్పాలంటే విద్యార్థులకు కాస్త రిలీఫ్. కొత్తవాటివి కాకుండా రెన్యూవల్ అప్లికేషన్లకు అవకాశం ఇచ్చారు.
గతేడాదికి సంబంధించి 12 లక్షల మంది విద్యార్థులు స్కాలర్ షిప్‌కు అర్హులు. ఇప్పటివరకు 10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. కొంతమంది దరఖాస్తు చేసుకోవాల్సివుంది. ఈ నేపథ్యంలో గడువును పొడిగించారు అధికారులు. వాస్తవానికి ఉపకారవేతనాల గడువు గతేడాది డిసెంబర్‌తో పూర్తి అయయింది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పలుమార్లు పొడిగించారు.
ఈ క్రమంలో అన్ని కోర్సుల విద్యార్థులకు ఇబ్బందులు రావొద్దని ఈనెల చివరి వరకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. చాలామంది విద్యార్థులు స్కాలర్ షిప్స్ కోసం అప్లయ్ చేసుకున్నారు. రెన్యూవల్ చేసుకునేవాళ్లు ప్రాసెస్ పూర్తి చేశారు. చాలామంది మిగిలిపోయారు. వెంటనే ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ-బీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ గడువు సైతం పొడిగించారు. కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ జాప్యం అయ్యాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు జూన్ 30 వరకు అవకాశం ఇచ్చారు. అర్హత కలిగిన విద్యార్థులు ప్రభుత్వానికి చెందిన ఈపాస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
ALSO READ: విద్యార్థులకు ముందస్తు కబురు.. అలా చేస్తే ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్
రెన్యువల్ చేసుకోవాల్సిన విద్యార్థులు సైతం ఈ వెబ్‌సైట్‌లో ప్రాసెస్ చేసుకోవచ్చు. కొత్త విద్యార్థులు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉపయోగించుకోవాలి. అప్పుడు బ్రౌజర్లో స్కాలర్ షిప్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత విద్యార్థులు తమ వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
అంతా ఓకే అయిన తర్వాత అప్లికేషన్ మరోసారి చెక్ చేసుకుని సబ్‌మిట్ బటన్ నొక్కాలి. అక్కడితో ఆ ప్రాసెస్ పూర్తి కానుంది. ఆ తర్వాత ఫుల్ చేసిన అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ ను నోట్ చేసుకోవాలి.