Pawan Kalyan: ప్రతి హీరో కెరియర్ లో కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాలు ఉంటాయి. కానీ అవి ఎప్పుడు మొదలై ఎప్పుడు ఎండ్ అవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. కొన్నిసార్లు సినిమా విషయంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. అన్ని మాట్లాడుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లే ముందు ఆగిపోయే సినిమాలు ఉన్నాయి. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత కూడా ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ముహూర్తం జరిగిన తర్వాత కూడా ఆగిపోయిన దాఖలాలు బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ చిరంజీవి కాంబినేషన్లో సినిమాలు దాదాపు 5,6 సార్లు మిస్ అయ్యాయి. అలానే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. జానీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి దర్శకుడిగా సత్యాగ్రహి అనే సినిమాను చేస్తాను అని అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన పూజ కూడా జరిగింది. ఆ సినిమాను ప్రస్తుత నిర్మాత ఏఎం రత్నం నిర్మించాలని అనుకున్నారు.
ఆ సినిమా జరిగి ఉంటే పాలిటిక్స్ కి దూరం
ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పవన్ కళ్యాణ్ హీరో మరియు దర్శకుడుగా అప్పట్లో సత్యాగ్రహి అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వలన జరగలేదు. పవన్ కళ్యాణ్ కథ సిద్ధం చేయాలి. అంతేకాకుండా అంతకుముందు దర్శకత్వం వహించిన జానీ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే పవన్ కళ్యాణ్ దానిమీద ఎక్కువగా దృష్టి సారించలేదు. ఇక ఇదే విషయంపై రీసెంట్ గా నిర్మాత ఏఎం రత్నం స్పందించారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ను కలిసినప్పుడు, ఏం రత్నం ఈ విషయాన్ని గుర్తు చేశారట. మీరు అప్పుడు నన్ను కలిసి ఉంటే ఆ సినిమా హిట్ అయి ఉంటే నేను పాలిటిక్స్ లోకి రాకుండా అమీర్ ఖాన్ సినిమాలు చేసుకుంటూ ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. అయితే అదే తరహాలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా కూడా వచ్చింది.
హరిహర వీరమల్లుతో ప్రేక్షకులు ముందుకు
ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ రేంజ్ సెలబ్రేషన్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. దానికి తోడు పవన్ కళ్యాణ్ చాలా ఏళ్లు తర్వాత మొదటిసారి స్ట్రైట్ ఫిలిమ్ తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమా కావడంతో అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. అలానే ఈ సినిమాకి సంబంధించి 90% వరకు హైలెట్ సీన్స్ ఏవి బయట పెట్టలేదు అని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ సప్రైజ్ అయితే ఈ సినిమా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
Also Read: Miss World 2025 : మిస్టర్ వరల్డ్ లో మీరు పోటీ చేస్తారా.? రౌడీ హీరో పన్నీ రిప్లై