BigTV English

Maoist Encounter: కనుమరుగవుతున్న మావోయిస్టులు.. అడవుల్లో ప్రస్తుత పరిస్థితులేంటి? అక్కడేం జరుగుతోంది?

Maoist Encounter: కనుమరుగవుతున్న మావోయిస్టులు.. అడవుల్లో ప్రస్తుత పరిస్థితులేంటి? అక్కడేం జరుగుతోంది?

Maoist Encounter: నక్సల్స్ ఫ్రీ కంట్రీకి భారత దళాలు అత్యం దగ్గరకు వచ్చేశాయా? ఇక మిగిలింది పదిహేను మంది అగ్రనేతలు మాత్రమే మిగిలి ఉండటం.. వారితో చివరి యుద్ధాన్ని ప్రకటించడంతో.. ఇక మావోయిస్టులు దాదాపు కనుమరుగయ్యేనా? అడవుల్లో ప్రస్తుత పరిస్థితులేంటి? అక్కడేం జరుగుతోంది?


ఏళ్ల తరబడి సాగిన నిఘా సేకరణ

ఇది చివరి అధ్యాయం. అలాగని.. ఇదేమంత తేలిగ్గా సాధ్యం కాలేదు. ఆ మాటకొస్తే మేం చేసింది కేవలం ఎన్ కౌంటర్లు మాత్రమే కాదు. ఏళ్ల తరబడి సాగిన నిఘా సేకరణ, గ్రౌండ్ లెవల్ ఆపరేషన్ల నిరీక్షణ. రకరకాల దళాల సమిష్టి కృషికి నిదర్శనం. ఇదీ బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చేసిన కామెంట్లు.


పోలీసులు పట్టుబడితే.. మావోయిస్టు సామ్రాజ్యం

బసవరాజు మరణం అంత తేలికైనది కాదంటారు ఐజీ సుందర్రాజ్. పోలీసులు పట్టుబడితే మావోయిస్టు ఉద్యమ నాయకత్వం ఎలా కుప్పకూలిపోతుందో చెప్పే దృశ్యం. ఇది ఒక్కటే ప్రాణం కావచ్చు. కానీ దాని వెనక దాగిన ఉద్యమ స్ఫూర్తి మొత్తం దారుణంగా దెబ్బ తింటుందని అంటారు పోలీసులు.

మావోయిస్టు నాయకత్వపు గుండెల్ని చీల్చింది

మే 21న అబుజ్మడ్ అడవుల్లో జరిగిన ఆపరేషన్లో.. మావోయిస్టు చీఫ్‌ బసవరాజు మరణం.. వామపక్ష తీవ్రవాదనికి వ్యతిరేకంగా భారతదేశం యావత్తూ చేస్తున్న యుద్ధంలోనే కీలక మలుపు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్.. మావోయిస్టు నాయకత్వపు గుండెల్ని చీల్చింది. అంతే కాదు ఉద్యమ బలాన్ని దాదాపు నిర్వీర్యం చేసింది. ఇది మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది జీవన యానపు ముగింపు మాత్రమే కాదు. దేశంలో దశకాలుగా కొనసాగుతున్న.. మావోయిస్టు తిరుగుబాటుపై మన భద్రతా దళాలు సాధించిన అద్భుతమైన విజయంగా అభివర్ణిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.

2026 మార్చి 31వ తేదీలోగా..

2026 మార్చి 31వ తేదీలోగా.. భారత భూభాగం పై నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి గడువు విధించుకున్నాయి మన భారత భద్రతా దళాలు. అయితే అడవిలో స్మశాన వైరాగ్యం పూర్తిగా అలుముకుందని చెప్పలేం. ఇంకా అక్కడ బతికే ఉన్న దెయ్యాలు తమ తుపాకులను గురి పెట్టగలవని కూడా అంటున్నారు అధికారులు. బస్తర్లో దాగి ఉన్న మావోయిస్టుల జాబితా ఇంకా మిగిలే ఉంది. భద్రతా దళాలకిది ఇంకా డెడ్ అండ్ డేంజర్ జోన్ గానే ఉందంటారు హయ్యర్ అఫీషియల్స్.

మిగిలిన 15 మంది మావోయిస్టులు

ఇప్పటికీ అడవుల్లో రహస్యంగా దాగి ఉన్నారు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు. సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన అత్యంత ప్రమాదకరమైన వారు ఇక్కడ మిగిలే ఉన్నారు. వీరిలో కొందరు చనిపోయినా.. మరికొందరు కటకటాల వెనక్కు వెళ్లినా.. ఇప్పటికీ కొందరు ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నారు. వారింకా మన దళాల గుండెలకు తుపాకీ గురి పెడుతూనే ఉన్నారని అంటున్నారు అధికారులు.

మల్లోజుల వేణుగోపాల్ అలియాస్- భూపతి

ఇప్పటికీ మిగిలే ఉన్న ఆ మావోయిస్టుల జాబితాలో ఎవరున్నారని చూస్తే.. మొదటి పేరు ముప్పాళ్ల లక్ష్మణ రావు, అలియాస్ గణపతి. మావోయిస్టు ఉద్యమానికి మూల స్థంభమైన గణపతి.. అజ్ఞాతంలో ఇంకా జీవంచే ఉన్న మోస్ట్ వాంటెడ్ లో ఒకరు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి. వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు, చెల్లాచెదురైన కార్యకర్తలను తిరిగి సమీకరించగల సమర్ధుడు. భూపతి సైతం భద్రతా దళాల టార్గెట్ లో ఒకరు. తిప్పరి తిరుపతి అలియా్ దేవ్ జీ, అలియాస్ సంజీవ్, అలియాస్ రమేష్. ఇతడు ఎన్నో ప్రాణాంతక దాడుల సూత్రధారి. అడవుల్లో దాగి ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల్లో ఒకరు.

మిషిర్ బెస్రా అలియాస్- భాస్కర్

ఈ జాబితాలో మిగిలిన వారెవరని చూస్తే.. మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్. కమ్యూనికేషన్లో దిట్ట. కద్రి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా.. అనుభవజ్ఞుడైన వ్యూహకర్తల్లో ఒకరు. వివిధ ప్రాంతాల్లో పని చేసిన మావోయిస్ట్. పుల్లారి ప్రసాద రావు అలియాస్ చందన్న, మోడెం బాలకృష్ణ అలియాస్ బాలన్న, గణేష్ ఉయకె అలియాస్ రాజేష్ తివారీ, అనల్ అలియాస్ తుఫాన్, గజరాల రవి అలియాస్ ఉదయ్, సవ్యసాచి గోస్వామి అలియాస్ అజయ్, రాజ్ చంద్రారెడ్డి అలియాస్ కట్టా రామచంద్ర, సుజాత అలియాస్ కల్పన, తెంటు లక్ష్మి అలియాస్ నరసింహ చలం, మద్వి హిద్మా అలియాస్ హిద్మన్న. 2021లో సుక్మా దాితో సహా అనేక దాడుల్లో నిందితుడు హిద్మా. బస్తర్లో ఈ పేరు చెబితేనే ఒక హడల్.

మరణంతోనే యుద్ధం ముగించాల్సిన పని లేదు-పోలీసులు

సీపీఐ మావోయిస్ట్ అగ్రనాయకత్వంలో సగానికి సగం నిర్మూలించామంటారు బస్తర్ ఐజీ. కేవలం 15 మంది అగ్ర నాయకులు మాత్రమే మిగిలి ఉన్నారనీ వీరిని కూడా తాము ట్రాక్ చేస్తున్నామని అన్నారు వీరిలో చాలా మంది వృద్ధులున్నారనీ.. అలసిపోయిన వీరు లొంగిపోవాలని కూడా చూస్తున్నారనీ అంటున్నారు పోలీసులు. అయితే వీరికోసం మా విజ్ఞప్తి ఎంతో స్పష్టమనీ.. ప్రధాన స్రవంతిలోకి తిరిగి రండి. ఈ యుద్ధం మరణంతోనే ముగించాల్సిన అవసరం లేదని పిలుపునిస్తున్నారు బస్తర్ పోలీసులు.

ఇంతకీ ఈ ప్రాంతంలో పోలీసుల అంతిమ లక్ష్యమేంటి?

గత మూడేళ్లలో సీపీఐ మావోయిస్ట్ దాని అగ్ర నాయకత్వాన్ని.. ఒక పద్ధతి ప్రకారం లక్ష్యంగా చేసుకున్నాయి భద్రతా దళాలు. గత 17 నెలల్లో ఛత్తీస్ గఢ్, ఈ పరిసర ప్రాంతాల్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న 400 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ఇది మన భద్రతా దళాల భారీ విజయంగా వర్ణిస్తారు పోలీసులు. ఇంతకీ ఈ ప్రాంతంలో పోలీసుల అంతిమ లక్ష్యమేంటి? ఆ వివరాలు ఎలాంటివి..

గరియా బంద్- చలపతి .. మృతదేహ స్వాధీనం

భావి గిరిజన తరాలు తుపాకీ పట్టకుండా చూడాలన్నదే లక్ష్యం- బస్తర్ పోలీసులుబస్తర్ లో.. మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల్లో నాయత్వం వహిస్తోన్న ఐజీ సుందర్రాజ్.. ఉద్యమ చరిత్రలోనే ఇది నిర్మాణాత్మక దశగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దీపక్ తేల్తుంబ్డేన హతమార్చాం. ఛత్తీస్ గఢ్ గరియాబంద్ లో చలపతి మృతదేం స్వాధీనం చేసుకున్నాం. మే 21న అబుజ్ మడ్ లో మైల్ స్టోన్ లాంటి ఆపరేషన్. మావోయిస్టు అగ్రనేత కమాండర్ బసవరాజును మట్టుబెట్టాం.

జార్ఖండ్- అరవింద్.. మృతదేహ స్వాధీనం

జార్ఖండ్ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ ని అరెస్ట్ చేశాం. తర్వాత కాసేపటికే అతడి భార్య షీలా సైతం పట్టుబడింది. నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, రామకృష్ణ, హరిభూషణ్‌, సుదర్శన్ దక్షిణ బస్తర్ లో వేరు వేరు సమయాల్లో మరణించారు. జార్ఖండ్ లో అనారోగ్యం కారణంగా మరణించిన అరవింద్ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం ఒకప్పుడు వీరంతా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. వీరిలో చాలా వరకూ మార్గదర్శకులు, వ్యూహకర్తలు, కమాండర్లున్నారని సగర్వంగా ప్రకటిస్తున్నారు బస్తర్ పోలీసులు.

టాప్ 10 మావోయిస్టుల్లో 8 మందిని హతమార్చాం- బస్తర్ పోలీసులు

అతి పెద్ద హెడ్ లైన్ ఏంటంటే. మావోయిస్టు చరిత్రలో తొలిసారిగా.. భద్రతా దళాలు టాప్ 10 మావోయిస్టుల్లో 8 మందిని విజయవంతంగా హతమార్చామని అంటున్నారు పోలీసులు. ఆ మిగిలిన వారిని కూడా నిర్మూలించగలిగితే ఇది మావోయిస్టులకు అతి పెద్ద దెబ్బగా మారుతుందని అంటున్నారు పోలీసులు.

మిగిలిన వారు చివరిగా సత్తా చాటవచ్చు జాగ్రత్త!

అలాగని ఈ విజయం ఇంకా ముగియలేదంటారు వీరు. 15 మందికి పైగా ఉన్న మావోయిస్టు అగ్రనాయకులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. వీరు అడవుల్లోనే దాక్కుని ఉన్నారు. ఏ క్షణంలోనైనా.. బయటకు రావచ్చు. తుపాకులు పేలవచ్చు. ఎందుకంటే వారు గతంలోకన్నా ఎంతో అసంతృప్తితో ఉన్నారు. తమ చివరి సత్తా చూపించడానికి ఉవ్విళ్లూరవచ్చన్న హెచ్చరిక చేస్తున్నారు బస్తర్ ఐజీ సుందర్రాజ్.

సాంకేతికత, సమాచారం, సమన్వయం.. భేష్- ఐజీ

కేంద్ర ప్రభుత్వం కూడా మెరుగైన సాంకేతికత, సమాచారం, రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించిందని అంటారు పోలీసులు. బసవరాజును చంపిన అబుజ్మడ్ వంటి ఆపరేషన్లు కొన్నేళ్లుగా మధించిన పోలీసు మేధస్సుకు తార్కాణం. భద్రతా దళాల వ్యూహాత్మక అడుగులకు నిదర్శనంగా చెబుతున్నారు.

మారుమూల గుండేకోట్ లో జరిగిన బసవరాజ్ ఆపరేషన్

బసవరాజును చంపిన ఆపరేషన్.. దుర్బేధ్యమైన అబుజ్మడ్ లోని మారుమూల గ్రామమైన గుండే కోట్ లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉనికి చాలా తక్కువ. రోడ్లు పాఠశాలలు ఆరోగ్య కేంద్రాలు ఇప్పటికీ లేవు. మావోయిస్టు నియంత్రణలో ఉన్న ఇక్కడి వారు మావోయిస్టుల పేరెత్తడానికే భయపడిపోతారు.

ఆరుగురి పిల్లల్లో ఒకర్ని తీస్కెళ్లారు- బాధితురాలు

రెండేళ్ల క్రితం నక్సల్స్ మా ప్రాంతానికి వచ్చారు. మాకు ఆరుగురు పిల్లలున్నట్టు వారు చూశారు. మాకు ఒకరిని ఇవ్వమని మా తల్లిదండ్రులను అడిగారని అంటుంది ఒక బాధితురాలు. వారు కోరినట్టుగానే మా సోదరి మాడ్కోను తీసుకెళ్లారని.. మేం గానీ వ్యతిరేకిస్తే. మొత్తం గ్రామాన్ని శిక్షిస్తారన్న భయంతోనే ఆనాడు వారిని అడ్డుకోలేదంటుందీ బాధితురాలు.

బస్తర్ అంతటా ఇలాంటి విషాద గాథలే..

బస్తర్ అంతటా ఇలాంటి విషాధ గాథలు సర్వ సాధారణం. ఇక్కడ మావోయిస్టుల ఉనికి దశబ్దాల తరబడి రాజ్యమేలుతోంది. అంతే కాదు తుపాకులను చూపించి.. ఆ భయంతో బలవంతపు నియామకాలు సాగించేవారు మావోయిస్టులు. ప్రభుత్వం అభవృద్ధిని కాంక్షిస్తుంది. ప్రోత్సహిస్తుంది కానీ ఇలాంటి వాటిని కాదంటారు బస్తర్ పోలీసు అధికారులు.

గ్రామ రక్షణ కమిటీలు, అటవీ సహకార సంస్థలు, ప్రజా సంఘాల చొరవతో..

మావోయిస్టు కమాండ్ నిర్మాణం కూలిపోవడంతో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రోత్సహిస్తోంది. మేము వీరి జీవిత గాథలను విషాదాంతాల నుంచి విజయవంతంగా మార్చాలనుకుంటున్నామని అంటారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ. పాఠశాలలు లేని ప్రాంతాల్లో పాఠశాలలు, గిరిజన కుటుంబాల ఆదాయం పెంచడానికి అటవీ ఉత్పత్తుల కేంద్రాలు గా మార్చుతున్నట్టు చెప్పారాయన. అంతే కాదు పాత మావోయిస్టు శిక్షణా కేంద్రాలను జీవనోపాధి కేంద్రాలుగా మార్చనున్నట్టు చెప్పారు.

బస్తర్ లో డ్రోన్లు, భారీ ఎత్తున పని చేస్తోన్న నిఘా వ్యవస్థ

ఈ అభివృద్ధిని వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు ఛత్తీస్ గఢ్ పాలకులు. స్థానికులకు మానసికంగా ధైర్యాన్నిస్తూ.. వారికి అభివృద్ధి ఫలాలను అందించడాన్నొక ఛాలెంజింగా తీసుకున్నట్టు చెబుతున్నారు. గ్రామ రక్షణ కమిటీలు, అటవీ సహకార సంస్థలు, ప్రజా సంఘాల చొరవతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఉప ముఖ్య మంత్రి విజయ్ శర్మ.

భావి గిరిజన తరాలు తుపాకీ పట్టకుండా చూడాలన్నదే లక్ష్యం- బస్తర్ పోలీసులు

ఇక్కడ ఆలోచించాల్సిన అసలు విషయమేంటంటే.. మావోయిస్టులను అంత తేలిగ్గా తీసుకోడానికి లేదు. వారి ప్రతి దాడి ఊహించని విధంగా ఉంటుంది. నిశ్శబ్ధంగా ఉండి.. ఒక సమయం చూసి విరుచుకుపడే అవకాశముంది. ప్రస్తుతం బస్తర్ అడవులు డ్రోన్లు, గస్తీ దళాల నిఘాలో ఉండొచ్చు. కాబట్టి, ఇప్పుడు వేడుకల కన్నా వేకువగా ఉండటం ముఖ్యమన్నది భద్రతా దళాలకు అందుతోన్న హెచ్చరిక. ఏది ఏమైనా.. దశాబ్దాల తర్వాత తొలిసారి.. గిరిజన భవిష్యత్ తరాలు తుపాకి పట్టకుండా, అడవిలోకి వెళ్లకుండానే ఎదుగుతుందని తాము ఆశిస్తున్నామని అంటున్నారు స్థానిక పోలీసు అధికారులు.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×