BigTV English

Stress Relief Tips: ఒత్తిడిని తగ్గించే చిట్కాలు

Stress Relief Tips: ఒత్తిడిని తగ్గించే చిట్కాలు

Stress Relief Tips: మానసిక ఆరోగ్యం క్షీణించడంలో ఒత్తిడి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఒత్తిడి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, మొత్తం ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. నేటి బిజీ లైఫ్‌లో ఒత్తిడి అనేది సర్వసాధారణమైపోయింది. ఎక్కువ ఒత్తిడికి లోనవడం కూడా మన పని తీరుపై ప్రభావం చూపుతుంది.


ఒత్తిడిని నియంత్రించడంలో కొన్ని సహజ పద్ధతులు మీకు బాగా ఉపయోగపడతాయి. వీటి సహాయంతో, ఒత్తిడిని క్రమంగా అదుపులోకి తీసుకురావచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ప్రధాన 5 మార్గాలను తెలుసుకుందాం.

ఒత్తిడిని నియంత్రించడానికి 5 మార్గాలు..


యోగా, మెడిటేషన్: యోగా ,ధ్యానం అనేది మనస్సును ప్రశాంతంగా ఉంచడంతో పాటు ఒత్తిడిని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడం వల్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది. అంతే కాకుండా మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

ప్రకృతికి దగ్గరవ్వండి: ప్రకృతికి దగ్గరగా సమయం గడపడం ఒత్తిడిని తగ్గించుకోవడానికి గొప్ప మార్గం. పార్కులో నడవడం, చెట్ల క్రింద కూర్చోవడం లేదా ప్రకృతి శబ్దాలను వినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

తగినంత నిద్ర పొందండి: తగినంత నిద్ర పొందడం మీ శరీరానికి, మనస్సుకు చాలా ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుంది.ఫలితంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.

శారీరక శ్రమ చేయండి: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామంతో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. యోగా చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.

సానుకూలంగా ఆలోచించండి: ప్రతికూల ఆలోచనలను మీ మనస్సు నుండి దూరంగా ఉంచండి. అంతే కాకుండా సానుకూలంగా ఆలోచించండి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది.

ఇతర ఉపయోగకరమైన చిట్కాలు:
సంగీతాన్ని వినండి: ప్రశాంతమైన , ఆహ్లాదకరమైన సంగీతం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. పాటలు వినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి రోజు ఇష్టమైన పాటలు వినడం అలవాటు చేసుకోండి.

Also Read: బరువు తగ్గాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే !

స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపండి: మీ ప్రియమైన వారితో సమయం గడపడం వలన మీరు సంతోషంగా ఒత్తిడి లేకుండా ఉంటారు. కుటుంబంతో ప్రతి రోజు గడపడానికి నిర్ధిష్టమైన సమయం కేటాయించండి.

నవ్వు: నవ్వు ఒక గొప్ప ఔషధం. నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. తరుచుగా నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీర ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదం చేస్తుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×