BigTV English

Amala Paul Son: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్, కాకపోతే..?

Amala Paul Son: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్, కాకపోతే..?

Amala Paul Jagat Desai become Parents: సౌత్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను ఆమె స్వయంగా సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. జూన్ 11న బాబు పుట్టాడు. కాకపోతే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా వెల్లడించింది. అమలాపాల్ చిన్నారిని చేతుల్లో పెట్టుకుని లాలిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆమెకు, చిన్నారికి అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఆ చిన్నారికి ఇలాయి అని పేరు కూడా పెట్టేశారు ఆ దంపతులు.


సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో హీరోయిన్ అమలాపాల్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ దంపతులు విడిపోయారు. ఈ వ్యవహారం నుంచి తేరుకోవడానికి ఆమె చాన్నాళ్లు పట్టింది. చివరకు గ్లామర్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. ఈ క్రమంలో సూరత్‌కి చెందిన వ్యాపారవేత్త జగత్ దేశాయ్‌తో రిలేషన్ మొదలైంది. అది కాస్తా ఫ్రెండ్‌షిప్‌గా మారి చివరకు మ్యారేజ్‌కు దారి తీసింది.

గతేడాది అక్టోబర్‌లో గోవాలో జరిగిన జగత్ దేశాయ్‌ పుట్టినరోజు వేడుకల్లో అమలాపాల్ మ్యారేజ్ విషయాన్ని బయటపెట్టింది. కొచ్చిలో వీరిద్దరు మ్యారేజ్ జరిగింది. టూరిజం, హాస్పటాలిటీ రంగాల్లో మంచి అనుభవం సంపాదించాడు జగత్ దేశాయ్‌. ఆ తర్వాత తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఈ ఏడాది జనవరిలో మా కుటుంబంలోకి మరొకరు రాబోతున్నట్లు సోషల్‌మీడియా ద్వారా అమలాపాల్ వెల్లడించింది.


Also Read: క్రిస్మస్‌ మూవీ సీజన్..టాలీవుడ్ వర్సెస్ హాలీవుడ్.. బన్నీకి పోటీగా లయన్ కింగ్!

మరి అమలాపాల్ గ్లామర్ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుందా? లేక గుడ్ బై చెప్పేస్తుందా? ఇదే ప్రశ్నలు ఇప్పుడు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. ఇప్పుడు కాకపోయినా కొద్దిరోజుల గ్యాప్ తర్వాతైనా ఆమె తన కెరీర్‌ని కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×