Ameesha Patel: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రముఖ హీరోయిన్ అమీషా పటేల్ (Ameesha Patel) కూడా ఒకరు. ఈమె తన అందంతో, నటనతో ఎంతోమంది యువతను ఆకట్టుకుంది. అంతేకాదు 48 ఏళ్ల వయసులో కూడా తన అందచందాలతో అందరిని అబ్బురపరుస్తోంది. ఇకపోతే ఇంత వయసు వచ్చినా సరే అందం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది ఈ బ్యూటీ. అంతేకాదు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ మేరకు తనకు రహస్యంగా పెళ్లి జరిగినట్లు కూడా ఒక రహస్యాన్ని బయటపెట్టిన ఈమె ఆ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ఎవరిని పెళ్లి చేసుకుంది? అనే విషయాన్ని కూడా తెలియజేసింది.
సల్మాన్ ఖాన్ తో పెళ్లిపై అమీషా క్లారిటీ..
ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ గురించి మాత్రమే కాకుండా, ప్రేమ గురించి కూడా బోలెడు విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తాను ఎవరితో ప్రేమలో ఉన్నానో కూడా తెలిపిన ఈమె.. నిజజీవితంలో తనకు పెళ్లి కాకపోయినా భర్తగా అంగీకరించిన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు కూడా పెళ్లి గురించి అమీషా పటేల్ ను అభిమానులు తరచూ ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే అమీషా తన ఇంటర్వ్యూలో ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నల గురించి ప్రస్తావించారు. ఇక అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ తో అమీషా పటేల్ పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం గురించి కూడా మాట్లాడింది. అందమైన వ్యక్తులతో జీవితం పంచుకుంటేనే ప్రేక్షకులకు నచ్చుతుందని కామెంట్లు చేసింది అలాగే సల్మాన్ ఖాన్ (Salman Khan) తో తన పెళ్లికి సంబంధించి అభిమానుల మదిలో తలెత్తుతున్న ప్రశ్నలకు కూడా ఈమె సమాధానం తెలిపింది. ఇకపోతే కొంతమంది ట్విట్టర్లో సల్మాన్ ను పెళ్లి చేసుకుని, అందమైన పిల్లలను కనాలని తనతో చెప్పారని కూడా అమీషా తెలిపింది.
అభిమానులు అడిగిన ప్రశ్నలపై అమీషా కామెంట్..
ఇకపోతే సల్మాన్ ఖాన్, అమీషా పటేల్ ఇద్దరూ కూడా వివాహం చేసుకోలేదు .కానీ ఇదే విషయంపై వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారని అమీషా పటేల్ తెలిపింది. ఇక ఆమె మాట్లాడుతూ.. నన్ను ఆస్క్ మీ ట్విట్టర్ చాట్ లో ఒక అభిమాని ఇలా అడుగుతూ..” మీరు అందంగా ఉంటారు. సల్మాన్ ఖాన్ కూడా అందంగా ఉంటారు
మీరిద్దరూ పెళ్లి చేసుకుని అందమైన పిల్లలను కనండి” అని అడిగారు. ఈ విషయాన్ని నేను నవ్వుతూ.. మీరు అనుకున్నది నిజమే. అందమైన వ్యక్తులు కలిసి ఉండడాన్ని కూడా ప్రపంచం ఇష్టపడుతుందని నేను భావిస్తున్నాను.’కహో నా ప్యార్ హై’ సినిమా తర్వాత నేను హృతిక్ తో కలిసి ఉండాలని చాలామంది అభిమానులు కోరుకున్నారు. కానీ హృతిక్ పెళ్లి గురించి చెప్పగానే చాలామంది అభిమానులు హర్ట్ అయ్యారు. అంటూ తెలిపింది అమీషా పటేల్. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈమె సల్మాన్ ఖాన్ తో యే హై జల్వా (2002) అనే సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించకపోయినా.. వీరి జోడి ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక ఇటీవల ఈమె సన్నీ డియోల్ తో కలిసి ‘గదర్ 2’ లో కూడా కనిపించిన విషయం తెలిసిందే.