Whip Adi Srinivas: నేతన్నల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ సర్కార్ పని చేస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. త్వరలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం తరపున రెండేసి చీరలు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. చీరల తయారీ ఆర్డర్‌ను సిరిసిల్ల పవర్లూమ్స్‌కు అప్పగించినట్టు వెల్లడించారు.
తొలి దశలో 4.6 కోట్ల మీటర్ల చీరల తయారీకి ఇచ్చిందన్నారు ప్రభుత్వ విప్. దీని ఫలితంగా ఎనిమిది నెలల పాటు పవర్ లూమ్స్ కార్మికులకు పని దొరుకుతుందన్నారు. ఆర్డర్‌లో 95 శాతం పనులు సిరిసిల్లలో పవర్ లూమ్స్‌కే ఇచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో స్వయం సహాయక మహిళలకు నాణ్యమైన చీరలు ఇవ్వబోతుందన్నారు.
వేములవాడలో 50 కోట్ల తో నూలు డిపోను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. 90 శాతం సబ్సిడీతో కార్మికులకు నూలు సరఫరా చేస్తున్నామని, ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ పాలాభిషేకం చేసినా తక్కువేనన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించిన రూ. 222 కోట్ల బకాయిలు పెడితే మా ప్రభుత్వం చెల్లించిందన్నారు.
కనీసం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ విద్యుత్ బకాయిలు గత ప్రభుత్వం చెల్లించలేక పోయిందన్నారు. పనిలోపనిగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహారశైలిపై దుమ్మెత్తి పోశారు. కమిషన్లకు కక్కుర్తిపడి బతుకమ్మ చీరలు కిలోల చొప్పున సూరత్ నుంచి గత ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారాయన. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ అసెంబ్లీలో ఒప్పుకున్నారన్నారు.
ALSO READ: తెలంగాణ ప్రజలకు అవకాశం.. నేటి నుంచి నాలుగు రోజులు
ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఆర్డర్ల ను టెస్కో మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. సిరిసిల్ల ప్రజలకు చర్మం తో చెప్పులు కుట్టించినా తప్పులేదని చెప్పిన కేటీఆర్, పదేళ్లు మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి నూలు డిపో తేలేదన్నారు. కేటీఆర్ వల్ల సిరిసిల్ల లో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదన్నారు.