Mohammed Siraj: హైదరాబాద్ కి చెందిన టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ { IPL 2025} మెగా వేళానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏ సమయంలో మొహమ్మద్ సిరాజ్ ని విడిచిపెట్టిందో కానీ.. ఫ్రాంచైజీ మారినప్పటి నుండి మహమ్మద్ సిరాజ్ చెలరేగిపోతున్నాడు. హేమా హేమీ బ్యాటర్లను సైతం తన బంతులతో బెంబేలెత్తిస్తున్నాడు. ఈ 18వ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ.. ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. పదునైన బంతులు విసురుతూ వికెట్లను ఎగరగొడుతున్నాడు. ఆర్సీబీ తనను రిలీజ్ చేయడం తప్పు అని నిరూపిస్తున్నాడు.
Also Read: Preeti Zinta In Temple: SRHను ఓడించేందుకు ప్రీతి జింటా కుట్రలు.. హైదరాబాద్ లోనే టెంపుల్ లోనే
ఈ సీజన్ లో మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు, అత్యధిక డాట్ బాల్స్ సంధించి అగ్రస్థానంలో ఉన్నాడు. సిరాజ్ అద్భుత ప్రదర్శన ఆర్సిబికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అయితే ఇలా అతను అద్భుతమైన ప్రదర్శనలతోనే కాకుండా.. తన లైఫ్ స్టైల్ తోను వార్తల్లో నిలిచాడు. మొహమ్మద్ సిరాజ్ విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది. ఖరీదైన వస్తువులను తన ఇంటిలోనే కాదు.. తన ఒంటికి ధరిస్తున్నట్లు ఈ ఫోటోలో చూడవచ్చు. విలాసవంతమైన విహారయాత్రల నుండి హైదరాబాద్ లోని తన విలాసవంతమైన ఇంటి వరకు తన అభిరుచిని ప్రదర్శిస్తుందటంలో ఎలాంటి సందేహం లేదు. సిరాజ్ ( Mohammed Siraj ) తాజాగా తన చేతికి ధరించిన ఓ లగ్జరీ బ్రాండెడ్ వాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Prithvi Shaw In CSK: CSKను కాపాడేందుకు బులెట్ లా దూసుకొస్తున్న పృథ్వీ షా
అయితే ఈ వాచ్ తెర తెలిస్తే మాత్రం కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే. సిరాజ్ తన చేతికి రోలెక్స్ డేటోనా రెయిన్ బో ప్లాటినమ్ వాచ్ ని ధరించాడు. ఈ వాచ్ లుక్ లోనే కాదు.. ధరతోను అందరి దృష్టిని ఆకర్షించింది. దీని ఖరీదు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా బిగ్ బాస్ 18 షూటింగ్ లో ఇలాంటి వాచ్ ధరించి కనిపించాడు. మహమ్మద్ సిరాజ్ దగ్గర ఇది ఒకటే కాదు.. హై అండ్ రోలెక్స్ వాచీలు మరెన్నో ఉన్నాయి. వీటిలో కోటి రూపాయల విలువైన రోలెక్స్ డేటోనా ప్లాటినమ్, 19.7 లక్షల విలువైన రోలెక్స్ జిఎంటి మాస్టర్ వంటివి కూడా ఉన్నాయి. దీనిని బట్టి సిరాజ్ రోలెక్స్ ఫ్యాన్ అని అర్థం చేసుకోవచ్చు. ఇక ఓ సాధారణ కుటుంబం నుండి వచ్చిన సిరాజ్.. క్రికెట్ లో అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాడు. మహమ్మద్ సిరాజ్ ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు అని నివేదికలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ తో షమీ జీవితం ఎంతో మారిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">