Mitchell Starc: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 tournament) రేపటి నుంచి పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో విదేశాలకు వెళ్లిపోయిన క్రికెటర్లందరూ ఇండియాకు వచ్చేస్తున్నారు. శుక్రవారం రాత్రికి అందరూ ఇండియాకు వచ్చి తమ జట్లలో కలిసిపోయారు. అయితే.. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ డేంజర్ బౌలర్ మిచెల్ స్టార్క్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ అభిమాని పై… ఎయిర్ పోర్ట్ లో రెచ్చిపోయి ప్రవర్తించాడు స్టార్క్.
Also Read: Hardik Pandya’s Ex wife : ప్రియుడితో కారులోనే సరసాలు.. నరకం అనుభవిస్తున్న పాండ్యా
ఇండియాకు చెందిన అభిమాని పై సీరియస్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో… ఐపీఎల్ 2025 టోర్నమెంట్ గత వారం రోజుల కిందట నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇండియాలో ఉన్న ఫారెన్ ప్లేయర్ లందరూ తమ దేశాలకు వెళ్లిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ స్టార్క్ కూడా ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో.. ఢిల్లీ విమానాశ్రయంలో ఓ అరుదైన సంఘటన జరిగింది.
ఉగ్రవాదులు దాడి చేస్తారన్న భయంతో స్టార్క్ హడావిడిగా ఢిల్లీ ఎయిర్ కోర్టు నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అయితే అదే సమయంలో.. ఇండియాకు చెందిన యూట్యూబర్… అతన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశాడు. వీడియో తీస్తూ హాయ్… స్టార్క్ బాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచాడు. కానీ ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ మాత్రం.. కాస్త ఓవరాక్షన్ చేశాడు. రెచ్చిపోయి ప్రవర్తించాడు. ఏ వెళ్ళిపో… అంటూ.. ఇంగ్లీషులో బూతులు తిట్టాడు మిచెల్ స్టార్క్. దీంతో ఆ యూట్యూబర్ వెంటనే సైలెంట్ అయిపోయాడు. మిచెల్ స్టార్క్ చాలా ఘనంగా ఉన్నాడని… వీడియోలో స్పష్టంగా చెప్పాడు ఆ యూట్యూబ్. దీనికి సంబంధించిన వీడియో వారం రోజుల కిందట జరిగితే ఇప్పుడు వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నుంచి స్టార్క్ ఔట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ స్టార్క్ కు దూరం కాబోతున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ మరో కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండియాకు రావడం లేదు స్టార్క్. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మే 17వ తేదీ అంటే రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్… జూన్ మూడో తేదీ వరకు… కొనసాగనుంది. జూన్ 3 న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఐపీఎల్ మెగా టోర్నమెంట్ 2025 మొత్తం 6 వేదికలలో మాత్రమే జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొత్త షెడ్యూల్ నేపథ్యంలో అన్ని జట్లు రెడీ అయ్యాయి.
Also Read: Andrew Symonds: వివాదాలకు కేరాఫ్ సైమండ్స్.. స్టేడియంలో ఫ్యాన్ ను చితకబాదాడు
— Out Of Context Cricket (@GemsOfCricket) May 16, 2025