OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని సినిమాలు డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అటువంటి సినిమాలు చూడటానికి యూత్ ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఏకాంత సన్నివేశాలు ఎక్కువగా ఉండే ఈ రొమాంటిక్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? వివరాల్లోకి వెళితే…
ప్లెక్స్ (Plex)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ మూవీ పేరు ‘ది లేడీ షాగన్ అండ్ హార్ మెన్‘ (The Lady Shogun and Her Men). ఈ మూవీలో 3,000 మంది యువకులు రాణినితో ఆ పని చేయడానికి తయారవుతారు. రొమాంటిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ రొమాంటిక్ మూవీ ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
17వ శతాబ్దంలో ఒక రాజ్యంలో ఒక వింత వ్యాధి వచ్చి మగవాళ్ళు మాత్రమే ఎక్కువగా చనిపోతారు. ఆ రాజ్యంలో ఆడవాళ్లు మాత్రమే పనులు చేసుకుంటూ ఉంటారు. మగవాళ్ళు షోకేస్ బొమ్మలా ఉంటారు. ఎందుకంటే వందమంది ఆడవాళ్ళకి పది మంది కూడా మగ వాళ్ళు ఉండరు. ఇది ఇలా ఉంటే హీరో ఒక పేదింట్లో పెరుగుతాడు. ఇతనికి ఓనోబు అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. హీరో తనని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఇతనికి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో, రాజమహల్ లో ఉద్యోగానికి వెళ్లాలనుకుంటాడు. అయితే అక్కడ అమ్మాయిలకు ప్రెగ్నెంట్ చేస్తే బయట ఎక్కువ మంది డబ్బులు ఇస్తా రు. మిగతా వారిలా కాకుండా ఉద్యోగం కోసమే ఆ రాజ మహల్ కి వెళ్తాడు. అక్కడ యువరాణిని ఆనంద పరచడానికి 3000 మంది అబ్బాయిలు రెడీగా ఉంటారు. వారిలో మన హీరో లాస్ట్ పర్సన్ గా వెళ్తాడు. అక్కడ టాప్ లిస్టులో చాలామంది ఉంటారు. వీరిలో హీరో కూడా తన శరీర సౌష్టవం తో ఆ ప్లేస్ లోకి చేరుకుంటాడు.
యువరాణి అక్కడికి వచ్చిన వాళ్ళని చూసుకుంటూ వెళుతుంది. అందరూ బాగా అందంగా రెడీ అవుతారు. హీరో మాత్రం మాసిన బట్టలతో నార్మల్ గా ఉంటాడు. యువరాణి అతనిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటుంది. అయితే యువరాణితో గడిపిన రాత్రి తర్వాత ఆ వ్యక్తిని చంపేస్తారు. ఈ విషయం తెలుసుకుని యువరాణి కూడా బాధపడుతుంది. ఆ తర్వాత హీరోతో యువరాణి గడిపే రాత్రి వస్తుంది. తనని చంపేస్తారని హీరోకి కూడా తెలిసి భార్య పిల్లల పరిస్థితి తెలుసుకుంటాడు. చనిపోతే వారికి చాలావరకు ధనం అందుతుందని తెలుసుకుంటాడు. చివరికి యువరాణి హీరోతో ఏకాంతంగా గడుపుతుందా? హీరో ఆ రాజ్యంలో బలవుతాడా? మిగతా 3000 మంది అబ్బాయిల పరిస్థితి ఏంటి? ఇతని గర్ల్ ఫ్రెండ్ ఓనోబు పరిస్తితి ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ ‘ది లేడీ షాగన్ అండ్ హార్ మెన్’ (The Lady Shogun and Her Men) మూవీని చూడాల్సిందే.