BigTV English
Advertisement

HCU Dispute: హెచ్‌సీయూ ల్యాండ్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

HCU Dispute: హెచ్‌సీయూ ల్యాండ్ వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

HCU Dispute: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కంచె గచ్చిబౌలి భూములపై చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ మధ్యంతర నివేదికను పంపారు. హైకోర్టు నివేదికను జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా కీలకం అయిన అంశమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి అంశాలను అమికస్‌ క్యూరీ.. జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం ముందు ఉంచింది.

ALSO READ: Jobs: రూ.లక్ష జీతంతో ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ పాసైతే చాలు భయ్యా..


సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం..

ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చగా.. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటిని ప్రశ్నల వర్షం కురిపించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా,  జేసీబీలతో చెట్లను తొలగించే ముందు అయినా సీఈసీ అనుమతి తీసుకున్నారా..? అని నిలదీసింది. రాష్ట్రంలో ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్‌దే బాధ్యతని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఆగ్రహం

ఒక్కే రోజులో వంద ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. తమ ప్రశ్నల అన్నింటికి సీఎస్‌ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోలేరని.. తెలంగాణ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతగా సుమోటోగా విచారణ చేపట్టామని.. హైకోర్టు రిజిస్ట్రార్ ను ప్రత్యక్ష పరిశీలనకు పంపించి నివేదిక తెప్పించుకున్నామని పేర్కొంది.. ఆ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్నామని జస్టిస్ గవాయ్ ప్రకటించారు.

 అన్నీ నిలుపుదల చేయండి..

ఇదే అంశంపై ఈ రోజు పొద్దున సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటల్లోగా నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 ఏళ్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అసలు ఎక్కడా.. అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తాజాగా మరోసారి ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యలు అన్నీ నిలుపుదల చేయాలని ఆదేశించింది.

ALSO READ: Praveen pagadala cc tv footage: ఈ ప్రశ్నలకు బదులేది? సీసీటీవీ ఫుటేజీలు నిజం కాదా? హర్షకుమార్, పాల్ సందేహాలు

ALSO READ: Tenth Class Results: మే ఫస్ట్ వీక్‌లో టెన్త్ ఫలితాలు.. జస్ట్ వారం రోజుల్లోనే ముల్యాంకనం ముగిసేలా..?

 

Related News

Ande Sri: గొడ్ల కాపరి నుంచి.. గేయ రచయితగా.. ప్రజాకవి అందెశ్రీ బయోగ్రఫీ

Kcr Campaign: జూబ్లీహిల్స్ ప్రచార బరిలో కేసీఆర్.. చివరకు అలా ముగించారు

Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు: ఎన్నికల అధికారి కర్ణన్

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Ande Sri: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. ఆదివారం సాయంత్రానికి సగం పంపిణీ? ఓటుకు రెండు వేలా?

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Big Stories

×