BigTV English

Pumpkin Juice: ఈ జ్యూస్ తాగితే.. ఈజీగా వెయిట్ లాస్

Pumpkin Juice: ఈ జ్యూస్ తాగితే.. ఈజీగా వెయిట్ లాస్

Pumpkin Juice: గుమ్మడి కాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు గుమ్మడి కాయను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. గుమ్మడి కాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా విటమిన్ C,B1,B3 వంటివి కూడా అధిక మోతాదులో ఉంటాయి.


ఇదిలా ఉంటే గుమ్మడి కాయలోని పోషకాలు బరువు తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. గుమ్మడి కాయ జ్యూస్ తరచుగా తాగడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:


జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
గుమ్మడి కాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా ఇది కడుపును శుభ్రంగా ఉంచుతుంది. గుమ్మడి కాయను తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా దీనివల్ల మలవిసర్జనలో ఎటువంటి సమస్య ఉండదు. ఇది పేగులకు కూడా మంచిది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
రోజూ తెల్ల గుమ్మడికాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా నియంత్రణలో ఉంటుంది. నిజానికి.. గుమ్మడికాయలో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువ. అందుకే మధుమేహంతో ఇబ్బంది పడే వారు దీనిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:
గుమ్మడి కాయ రసంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరం నుండి కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల.. అన్ని రకాల కాలేయ సంబంధిత సమస్యలు చాలా తగ్గుతాయి.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
గుమ్మడి కాయ జ్యూస్‌లో ఫైబర్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ కారణంగానే ఆరోగ్యకరమైన సహజ డ్రింక్‌గా పరిగణించబడుతుంది. ఇది శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. దీని కారణంగా మనం అన్ని రకాల గుండె సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.

రోగనిరోధక శక్తి బలపడుతుంది:
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, జలుబు, దగ్గు పదే పదే వచ్చే ప్రమాదం ఉంది. కానీ గుమ్మడి కాయ జ్యూస్ తాగడం ద్వారా రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతే కాకుండా ఈ జ్యూస్ యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. దీని కారణంగా సాధారణ జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

Also Read: మట్టి కుండలోని నీళ్లు తాగితే.. ఇన్ని ప్రయోజనాలా ?

బూడిద గుమ్మడికాయ రసం ఎలా తయారు చేయాలి ?

గుమ్మడి కాయ జ్యూస్ తయారు చేయడానికి.. ముందుగా దాని తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి. బాగా రుబ్బిన తర్వాత.. వడకట్టండి. మీరు ఈ రసాన్ని కొద్దిగా పలుచగా చేయాలనుకుంటే.. దానికి నీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న జ్యూస్‌కు నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి వెంటనే తాగాలి. ఈ రసం శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా బరువును కూడా త్వరగా తగ్గేలా చేస్తుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×