Anchor Ravi : ప్రస్తుతం ప్రతి చిన్న విషయానికి మనోభావాలు దెబ్బ తినడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు. కొన్నిసార్లు ప్రతి సినిమా విషయంలో కూడా మనోభావాలు దెబ్బతింటు ఉంటాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో “గొల్లభామ వచ్చి గోరుగిల్లుతుంటే” అనే మాట వలన చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. వెంటనే దానిని గోరువంక అనే పదం గా మార్చారు. అలానే హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమా పేరును మొదట వాల్మీకి అని పెట్టారు. దానివలన కొన్ని సంఘాలు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినడంతో ఆ టైటిల్ ను గద్దల కొండ గణేష్ గా మార్చారు. ఇలా చెబుతూ పోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
యాంకర్ రవి ఇష్యూ ఏంటి.?
రీసెంట్ టైమ్స్ లో ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం థియేటర్ కి వెళ్లి సినిమా చూడటం వరకే పరిమితం అయ్యేది. ఆ తర్వాత కాలంలో టీవీల్లో సినిమా చూడటం ఎంటర్టైన్మెంట్గా అనిపించేది. కానీ ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కు ఎక్కువ స్కోప్ ఉంది. టీవీ పెట్టగానే చాలా షోస్ ఎంటర్టైన్ చేస్తున్నాయి. అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ సోలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒక సీన్ ను రీ క్రియేట్ చేశారు. “నంది విగ్రహం కొమ్ముల మధ్య నుంచి చూస్తుంటే .. వెటరన్ హీరోయిన్ రంభ కనిపిస్తున్నట్టు స్కిట్ చేశారు యాంకర్ రవి , సుడిగాలి సుధీర్. దీనిపై హిందూ వానర సేన క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ కూడా చేశారు. దీనిపై రవి కూడా స్పందించారు. రవికి కాల్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు ఈ తరుణంలో మరో వీడియోను విడుదల చేశాడు యాంకర్ రవి.
యాంకర్ రవి మరో క్లారిటీ
యాంకర్ రవి ఈ వీడియోలో మాట్లాడుతూ వీడు మారిపోయాడు, వీడు అది ఇది అంటూ మాట్లాడుతున్నారు. నేను చత్రపతి శివాజీ ని ఫాలో అవుతాను, నేను హనుమాన్ చాలీసా చదువుతాను, నేను హిందువును, రోజు ఓం నమశ్శివాయ అనే నామాన్ని పటిస్తాను. అంటూ చెబుతూ అసలు ఏం జరిగిందో తన మాటల్లో మరోసారి చెప్పుకొచ్చాడు. అంతా చెప్పిన తర్వాత న్యూస్ చానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల తంబనైల్స్ పెట్టి వార్తలు రాస్తున్నారు వాటిని నమ్మకండి. మళ్లీ ఇలాంటివి మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతాను అంటూ ఆ వీడియోలో రవి క్లారిటీ ఇచ్చాడు.ఈ విషయం పైన మళ్ళీ వానర సేన ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. ఇక్కడితో వివాదం సద్దుమనిగి పోతుందా లేదంటే మళ్లీ మరో రూట్ ఎంచుకొని ఇంకా కాంట్రవర్సీగా మారనుందా అనేది చూడాలి.
Also Read : Suriya: ఆ ఇద్దరి స్టార్ హీరోల కం బ్యాక్ అయిపోయినట్టే, ఇంక సూర్య కం బ్యాక్ మిగిలింది