Suriya: సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ లో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సాధించుకున్నారు సూర్య. చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా సూర్యను అడాప్టెడ్ తెలుగు సన్ అని అంటూ ఉంటారు. సూర్య చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో మంచి గుర్తింపును సాధించుకున్నాయి. నువ్వు నేను ప్రేమ, గజిని, వీడొక్కడే, ఘటికుడు వంటి ఎన్నో సినిమాలు ఆ రోజుల్లోనే సూర్యకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. రీసెంట్ గా కంగువా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా పూర్తి డిజాస్టర్ గా పేరు సాధించింది.
శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉండేవి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి సినిమా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఈ సినిమా మరో బాహుబలి అవుతుంది అనే అందరూ భావించారు. నిర్మాత జ్ఞాన వేల్ రాజా కూడా ఈ సినిమాకు సంబంధించి దాదాపు 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ ఇవేవీ జరగలేదు. ప్రస్తుతం సూర్య ఒక హిట్ సినిమా చేస్తే చాలామంది అభిమానులు సంతోషపడతారు. ఇక ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య రెట్రో అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు అంచనాలను ఈ సినిమా నిలబెడుతుంది అని చెప్పొచ్చు.
Also Read : Akshay Kumar: తలనొప్పిగా మారిన ‘కేసరి 2’ వివాదం.. అక్షయ్ రియాక్షన్ ఏంటంటే..?
ఆ ఇద్దరు హీరోల కం బ్యాక్
తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ వరుసగా డిజాస్టర్ సినిమాలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ తరుణంలో ఇద్దరు హీరోలు మంచి కం బ్యాక్ ఇచ్చారు. రీసెంట్గా అజిత్ నటించిన గుడ్ బాడ్ అగ్లీ (Good Bad Ugly) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అలానే విక్రమ్ నటించిన వీర ధీర సూరన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూస్ తో మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోలు సక్సెస్ఫుల్గా కం బ్యాక్ ఇచ్చారు. ఇంక మిగిలిన కం బ్యాక్ సూర్య నుంచి మాత్రమే మిగిలింది. అది కార్తీక్ సుబ్బరాజు సినిమాతో ఫుల్ ఫీల్ అయిపోతుంది అని సూర్య అభిమానులు మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కార్తీక్ సుబ్బరాజు టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జిగతాండ డబుల్ ఎక్స్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు కార్తీక్. కార్తీక్ టేకింగ్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
Also Read : Odela 2 : లైవ్ లోకి శివయ్యనే తెచ్చారు… ప్రమోషన్స్ కి దేవుడిని వాడుతున్న సంపత్ నంది