BigTV English

NZ VS IND: బ్యాటింగ్ చేయనున్న రోహిత్ సేన…మిస్టరీ ప్లేయర్‌ వచ్చేశాడు!

NZ VS IND: బ్యాటింగ్ చేయనున్న రోహిత్ సేన…మిస్టరీ ప్లేయర్‌ వచ్చేశాడు!

NZ VS IND: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 tournament ) భాగంగా… ఇవాళ మరో రసవత్తర ఫైట్ జరగబోతుంది. టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ కీలక పోరు ఉంది. ఇప్పటికి టీమిండియా అలాగే న్యూజిలాండ్ రెండు జట్లు ( Team India vs New Zealand ) సెమీ ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. కానీ పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానాని కోసం ఇవాళ రెండు జట్లు మ్యాచ్ ఆడబోతున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో.. ఇదే చివరి లీగ్ మ్యాచ్ కూడా కావడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్.. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ కాసేపటి క్రితం ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన…న్యూజిలాండ్‌ మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో… రోహిత్‌ సేన మొదట బ్యాటింగ్‌ కు దిగనుంది.


Also Read: Ind vs Nz: ఇవాళ్టి మ్యాచ్‌ లో టీమిండియా ఓడితే… ఎవరితో సెమీస్‌ మ్యాచ్‌ ?

ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు… ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ ఆడుతుంది. ఒకవేళ టీం ఇండియా గెలిస్తే… ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య తొలి సెమీఫైనల్ దుబాయ్ ( Dubai ) వేదికగా జరుగుతుంది. అలా కాదని టీమిండియా ఓడిపోతే… గ్రూప్ బి లో ఉన్న దక్షిణాఫ్రికా తో… రెండో సెమీ పైనల్లో రోహిత్ శర్మ సేన.. ఆడబోతుంది. టీమిండియా తొలి సెమీ ఫైనల్ ఆడిన లేదా రెండో సెమీఫైనల్ ఆడిన… వేదిక మాత్రం దుబాయ్. మిగిలిన సెమీఫైనల్ మాత్రం పాకిస్తాన్లోని లాహోర్లో జరుగుతుంది.


ఇక… టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్… జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూడవచ్చు. అలాగే… స్పోర్ట్స్ 18 తో పాటు స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ వస్తుంది. జియో సిమ్ ఉన్నవారికి మాత్రమే జియో హాట్ స్టార్ లో ఉచితంగా చూసే అవకాశం కల్పించారు. అలాగే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 118 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఇందులో 60 మ్యాచ్ లో టీమిండియా గెలవగా…. 50 మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవాలని చాలామంది కోరుకుంటున్నారు. ఒకవేళ టీమ్ ఇండియా ఓడిపోతే దక్షిణాఫ్రికా తో సెమీఫైనల్… ఆడి నేరుగా ఫైనల్ కి వెళ్ళవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: Sa Vs Aus: పాకిస్తాన్ నుంచి దుబాయ్ పారిపోయిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా… కారణం ఇదే?

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(w), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఒరూర్కే

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×