Chiranjeevi: తెలంగాణను ఎకో టూరిజం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి శతవిధాలా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డు లోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎక్స్ పీరియం థీమ్ పార్క్ ను నేడు ఆయన ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు.”ఎకో టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలో, ప్రొద్దుటూరులో 25వేల జాతుల మొక్కలు వృక్షాలతో థీమ్ పార్క్ ను 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకృతి వనంగా మార్చడమే తమ ముందున్న లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ” ఎక్స్ పీరియం పార్కు లోని ప్రతి కార్నర్, ప్రతి వృక్షం చూసి సీఎం గారు ఎంత ముచ్చట పడిపోతున్నారు అంటే అంతా ఇంతా కాదు. ఇది ఎలా చేశారు.. అది ఎలా చేశారు అని అడుగుతున్నారు. నేను కొన్ని అడుగుతున్నాను. ఇది షూటింగ్ కు ఇస్తారా రామ్ దేవ్ అని అడిగితే.. ఇస్తానండీ.. కానీ, ఫస్ట్ షూటింగ్ మీదైతేనే ఇస్తాను అని అన్నాడు. ఆ మాట అన్నారు కదా అని కొత్తగా హీరోయిన్ ను తీసుకొచ్చి ఈ ఎండలో స్టెప్స్ వేయమంటే మాత్రం కష్టం. చలికాలంలో అయితే చేస్తాను అని చెప్పాను.
War 2 : మహేష్ బాబు ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా… ‘వార్ 2’లో సూపర్ స్టార్ కూడా…
అందుకు ఆయన.. ఈలోపు వర్షాలు పడి ఇంకా పచ్చగా ఉంటాయి.. రెండేళ్లలో ఇదంతా అద్భుతంగా ఉంటుంది.. కంటికి కనువిందుగా ఉంటుంది అని ఆయన చెప్తుంటే నేను ఊహించుకున్నాను.. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు.. రిసెప్షన్స్ పెట్టుకోవచ్చు.. ఈవెంట్స్ పెట్టుకోవచ్చు. వీటితో పాటు స్కెటింగ్ లాంటివి పెట్టాలనే ప్లాన్స్ ఉన్నాయి.
అవన్నీరామ్ దేవ్ చేయగలడు. దానికి ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సైతం అన్ని ప్రోగ్రామ్స్ ను పక్కన పెట్టి.. నిన్నటివరకు వేరే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. రామ్ దేవ్ మీద, ఈ ప్లేస్ మీద ఎంత నాప్రేమ లేకపోతే ఆయన ఇలా చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక చిరంజీవి కెరీర్ విషయానికొస్తే..వాల్తేరు వీరయ్య సినిమా తరువాత ఆయన నటిస్తున్న చిత్రం విశ్వంభర. బింబిసార సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. మొట్ట మొదటి సారి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చిరు నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
'ఎక్స్ పీరియం పార్కు'ను చూసి సీఎం రేవంత్ రెడ్డి, నేను ఆశ్చర్యపోయాం: మెగాస్టార్ చిరంజీవి
ఈ పార్క్ ని షూటింగ్స్ కి ఇస్తారా అని అడిగితే… నా సినిమా షూటింగ్ అయితే ఇస్తా అంటున్నారు
ఈ ఎండలో హీరోయిన్ తో డ్యాన్స్ అంటే కష్టం
వచ్చే శీతాకాలంలో ట్రై చేస్తానంటూ చిరు వ్యాఖ్య pic.twitter.com/clwtxM7YDy
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2025