BigTV English

Dragon Fruit Benefis: డ్రాగన్ ఫ్రూట్‌‌తో స్టన్ అయ్యే ‘పవర్’..

Dragon Fruit Benefis: డ్రాగన్ ఫ్రూట్‌‌తో స్టన్ అయ్యే ‘పవర్’..

Dragon Fruit Benefis: డ్రాగన్ ఫ్రూట్‌ అంటే కొంత కాలం క్రితం ఇటు వైపు పెద్దగా తెలియదు. కానీ ప్రస్తుత కాలంలో డ్రాగన్ ఫ్రూట్‌‌‌ అంటే తెలియని వారంటు ఉండరు.. రానురాను ఇక్కడి రైతులు కూడా దీనిని సాగు చేయడం మొదలుపెడుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌ ధర ఖరీదైనదిగా అనిపించిన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో చాలా లాభాలు ఉన్నాయి. మంచి పోషకాలు, ప్రోటీన్లు, కేలరీలు, ఐరన్ కంటెంట్, విటమిన్ సి, ఇ, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

డ్రాగన్‌లో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఇది పెదపేగు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.


డయాబెటిస్ కంట్రోల్:

డ్రాగన్ ఫ్రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఎంపిక. ఇందులో ఫైబర్  అధికంగా ఉంటుంది. దీనిని షుగర్ వ్యాధిగ్రస్తులు తింటే షుగర్ లెవెల్ పెరగదంటున్నారు. అలాగే దీనిని తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది. ఇందులో ఉండే పీచు పదార్ధం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. క్రమం తప్పకుండా దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.

ఒమేగా 3 ఫ్యాట్:

డ్రాగన్ ఫ్రూట్‌ ఒమేగా 3 ఫ్యాట్‌లను కలిగి ఉంటుంది. ఒమేగా 3 కొవ్వులు చేపలలో ఉంటాయి. దీనిని తినని వారు ఈ పండు తినడం వల్ల ఒమేగా 3 కొవ్వులను పొందవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని రోజూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

డ్రాగన్ ఫ్రూట్‌‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది చర్య ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి ముఖ కాంతిని పెంచుతుంది. ముఖ్యంగా, ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, మృదువుగా చేస్తుంది. అలాగే చర్మ సౌందర్యానికి రోజూ డ్రాగన్ ఫ్రూట్‌ జ్యూస్ తాగితే చాలా మంచిది అంటున్నారు. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది:

డ్రాగన్ ఫ్రూట్‌‌లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే దీనిలోని విటమిన్ సి, ఇ, బి కణాలను రక్షిస్తుంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండు కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులోని బీటా కెరొటిన్ కంటి రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Also Read: చెడు కొలెస్ట్రాల్ చింత ఎందుకు.. వీటిని తింటే అంతా సెట్..

ఎముకల ఆరోగ్యం:

డ్రాగన్ ఫ్రూట్‌‌లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు డ్రాగన్ క్రమం తప్పకుండా తినడం వల్ల ఎముకలను దృఢంగా మార్చుతుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుందని నిపుణుల సైతం వెల్లడిస్తున్నారు.

డ్రాగన్ ఫ్రూట్‌‌ను ముక్కలుగా కట్ చేసి తినవచ్చు, లేదా గుజ్జును సలాడ్‌లు , జ్యూస్‌లు, స్మూతీస్, ఐస్‌క్రీమ్‌లు, డెజర్ట్‌లలో కూడా ఉపయోగించవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×