Betting Apps Case..బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ యాంకర్ శ్యామల (Anchor Shyamala)కూడా దొరికిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆమెను విచారణకు రావాలి అని పోలీసులు కోరగా.. ఆమె మాత్రం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇక తాజాగా ఆమె పిటీషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు.. శ్యామలకు గుడ్ న్యూస్ చెప్పింది. శ్యామలను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశం ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కానీ ఈ విషయంపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి భారీగా సంపాదించుకొని, ప్రజల జీవితాలతో ఆడుకునే ఇలాంటి సెలబ్రిటీలకు ఇప్పుడు హైకోర్టు లో ఊరట కలిగించడంపై నెటిజన్లు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యాంకర్ శ్యామల కెరియర్..
యాంకర్ శ్యామల విషయానికి వస్తే.. ఈమె యాంకర్ మాత్రమే కాదు మంచి నటి కూడా.. అసలు ఇండస్ట్రీలోకి మొదట నటిగానే అడుగు పెట్టింది. అలా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘గోరింటాకు’, ‘అభిషేకం’, ‘లయ’ వంటి సీరియల్స్ లో నటించిన ఈమె సీరియల్స్ లో నటిస్తున్నప్పుడే ప్రముఖ నటుడు నరసింహారెడ్డి తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారి, ఇంట్లో నుండీ పారిపోయి మరీ నరసింహారెడ్డిని వివాహం చేసుకుంది. వాస్తవానికి ఈమె ఒక బ్రాహ్మిణ్. అయితే గత ఏడాది ఎన్నికలు జరిగిన సమయంలో శ్యామల రెడ్డిగా పేరు మార్చుకుంది. ఇక ఈమె ఇప్పుడు రాజకీయాలలో కూడా వేగంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే శ్యామల పట్టుకుంటే పట్టు చీర, మా ఊరి వంట వంటి కార్యక్రమాలకు యాంకర్ గా చేయడంతో ఈ షోలు ఈమెకు మంచి పేరును అందించాయి. ఇక సినిమా ఈవెంట్ లు, ఆడియో ఫంక్షన్లు, మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా కూడా హౌస్ లోకి వెళ్లి ఒకసారి ఎలిమినేట్ అయి మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక అలా శ్యామల అటు నటిగా ఇప్పుడు రాజకీయ నేతగా కూడా మంచి పేరు సొంతం చేసుకుంటుంది. ఇక ఇలాంటి సమయంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఇరుక్కుని ఇబ్బంది పడుతుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఆధారాలు లభించడంతో పోలీసులు విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఇప్పుడు వాటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు ఈమెకు అనుకూలంగా తీర్పునిస్తూ అరెస్టు ఆపివేయండి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా మొత్తానికైతే హైకోర్టు తీర్పుతో శ్యామల కి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు.
Manchu Vishnu: మెగా కుటుంబంతో విభేదాలపై స్పందించిన విష్ణు.. ఏమన్నారంటే..?