BigTV English

AP Politics: రోజా లేని లోటు.. బాలయ్య ఉంటే బాగుండు! పవన్ కూడా..

AP Politics: రోజా లేని లోటు.. బాలయ్య ఉంటే బాగుండు! పవన్ కూడా..

AP Politics: జగన్ డుమ్మాతో.. ఏపీ అసెంబ్లీ కూల్ కూల్‌గా నడిచింది. విపక్షం లేకపోవడంతో.. అధికార పక్షమే ప్రతిపక్షమైంది. చర్చలతో పాటు ఆటలు, ఆటవిడుపులతో ఈ సెషన్ సందడిగా సాగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కల్చరల్ ప్రోగ్రామ్స్ మరింత హైలైట్. దుర్యోదనుడి గెటప్‌లో డిప్యూటీ స్పీకర్ రఘురామ.. ‘ఏమంటివి ఏమంటివి’ అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ఇరగదీశారు. మంత్రి కందుల దుర్గేష్.. పల్నాటి బాలచంద్రుడి వేషంలో శెభాష్ అనిపించారు. మిగతా సభ్యులూ యాక్టింగ్, సాంగ్స్‌లో అలరించినా.. వీరిద్దరే అందరికంటే ఎక్కువ ఎంటర్‌టైన్ చేశారు. డయాస్‌పై వారి పర్ఫార్మెన్స్ చూసి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పడి పడి నవ్వారు. ఈలలు, కేకలతో విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్ దద్దరిల్లిపోయింది. రాజకీయ నాయకులు నటిస్తారని అంటారు కానీ.. మరీ ఇంతటి మహానటులా అంటూ సోషల్ మీడియాలో కామెడీ పంచ్‌లు కూడా పడుతున్నాయి.


ఈవెంట్ ఇంత సందడిగా సాగినా.. కొందరు లేని లోటు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించిందని కామెంట్లు వస్తున్నాయి. మెయిన్‌గా నందమూరి నటసింహం.. బాలయ్య బాబును బాగా మిస్ అయ్యారు ఆడియన్స్, నెటిజన్స్. బాలయ్య తొడగొట్టినా ట్రెండే. మీసం మెలేసినా మేజిక్కే. ఆయన డైలాగ్ చెబితే గూస్‌బంప్సే. అలాంటి గాడ్ ఆఫ్ మాసెస్.. నందమూరి బాలకృష్ణ ఎక్కడ? అంటూ నెట్లో ఎంక్వైరీ చేస్తున్నారు. లయన్ వచ్చుంటే.. మేకప్ వేసి.. నటించి ఉంటే.. ఆ జోషే వేరే లెవెల్‌లో ఉండేదంటున్నారు. బాలయ్య నోటినుంచి వచ్చే భారీ డైలాగ్స్.. బాంబుల్లా పేలేవంటున్నారు. NBK అన్‌స్టాపబుల్. వీ మిస్డ్ బాలయ్య. వీ వాంట్ బాలయ్య.

ఇంతకీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడ? రెండు వారాల పాటు జరిగిన అసెంబ్లీ సెషన్‌కు ఎందుకు హాజరవ్వలేదు? ఎట్ లీస్ట్ లాస్ట్ రోజైనా వచ్చి.. కల్చరల్ ఈవెంట్లోనైనా పార్టిసిపేట్ చేస్తే బాగుండేది కదాని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అఖండ2 షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే బాలయ్య బాబు రాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.


Also Read : జనసేనాని ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతారా?

ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కల్చరల్ ఈవెంట్‌కు హాజరైనా.. ఆయన స్టేజీపై ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు. సినిమాలకు గ్యాప్ ఇచ్చినా ఇప్పటికీ పవర్ స్టారే టాలీవుడ్ టాప్ హీరో. నటుడైన పవన్.. ఏదైనా చిన్న స్కిట్ చేసుంటే బాగుండేదని ఫ్యాన్స్ కోరిక. అయితే, పవన్ కల్యాణ్ ఏదో యాక్సిడెంటల్‌గా యాక్టర్ అయ్యారు కానీ, ఆయనకు నటన, డ్యాన్సులపై అంతగా ఇంట్రెస్ ఉండదని.. పీకేనే పలు సందర్భాల్లో చెప్పారు. హీరో కాబట్టి, తప్పదు కాబట్టి సినిమాల్లో నటిస్తుంటారు కానీ.. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేసేంత ఆసక్తి కానీ, తీరికా కానీ జనసేనానికి లేదు. అందుకే, ఆయన.. మిగతా వారి టాలెంట్ చూస్తూ.. ఎంజాయ్ చేస్తూ.. తనదైన స్టైల్‌లో నవ్వుతూ కనిపించారు. అంతే. హ్హ.

మరోవైపు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజాను బాగా మిస్ అయ్యామంటూ సోషల్ మీడియాలో టీజింగ్ నడుస్తోంది. నగరిలో ఈసారి ఆర్కే రోజా ఓడిపోయారు కాబట్టి సభలో లేరు. అదే ఆమె ఎమ్మెల్యేగా గెలిచుంటే.. ఈ ఈవెంట్‌లో స్కిట్‌లతో, డ్యాన్సులతో, డైలాగులతో.. ఖబర్దస్త్ టాలెంట్ చూపించే వారంటూ రోజా గురంచి తెగ ఫీల్ అవుతున్నారు నెటిజన్లు.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×