BigTV English

Anee Master : జానీ గురించి అనీ మాస్టర్ ప్రెస్ మీట్… వెనకుండి ఇంత కథ నడిపించింది ఆ స్టార్ హీరోనా?

Anee Master : జానీ గురించి అనీ మాస్టర్ ప్రెస్ మీట్… వెనకుండి ఇంత కథ నడిపించింది ఆ స్టార్ హీరోనా?

Anee Master : టాలీవుడ్ లో జానీ మాస్టర్ (Jani Master) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయనపై లైంగిక ఆరోపణల కేసు నడుస్తున్న నేపథ్యంలో నేషనల్ అవార్డును క్యాన్సిల్ చేయడంపై తాజాగా లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ (Anee Master) ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అనీ మాస్టర్ తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ తను ఇన్ని రోజులు షాక్ లో ఉన్నానని, ఇలా ఆరోపణలు నిజమని ఇంకా తేలకపోయినప్పటికీ జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డును నిలిపివేయడం సమంజసం కాదంటూ కామెంట్స్ చేసింది. అయితే ఇప్పుడు అనీ మాస్టర్ పెట్టిన ఈ సడన్ ప్రెస్ మీట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా అనీ మాస్టర్ ప్రెస్ మీట్ వెనక ఉండి ఇంత కథ నడిపించింది ఓ స్టార్ హీరో అనే ప్రచారం జోరందుకుంది.


బాధితురాలికి అండగా అల్లు అర్జున్ 

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 2017 నుంచి తనపై లైంగిక దాడి చేస్తున్నాడని, సినిమాలలో అవకాశాలు రాకుండా చేస్తానంటూ వేధించాడని బాధితురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే ఆమెపై జానీ మాస్టర్ అత్యాచారం చేస్తున్నాడు అన్న ఆరోపణలు నేపథ్యంలో ఆయనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ విషయం టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపగా, జానీ మాస్టర్ ని వెంటనే జనసేన పార్టీ కార్యకాలాపాల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించారు జనసేనాని. ఆ తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం క్రేజీ మూవ్ తీసుకున్నారు. విషయం గురించి పెద్దగా రెస్పాండ్ కాకపోయినా బాధితురాలికి స్వయంగా ఫోన్ చేసి మరీ తను చేయబోయే సినిమాలన్నింటికీ కొరియోగ్రాఫర్ గా ఆమెకు ఛాన్స్ ఇస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కబోయే సినిమాలకు కూడా ఆమెకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసే ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. దీంతో అప్పట్లో ఈ విషయం సంచలనగా మారింది.


అనీ మాస్టర్ ప్రెస్ మీట్ వెనక ఆ స్టార్ హీరో…

అయితే ఇవన్నీ జరగడానికంటే ముందే కన్నడ సినిమా ‘యువరత్న’, ‘తిరుచిత్రాంబలం’ సినిమాలకుగాను జానీ మాస్టర్ ను నేషనల్ అవార్డు వరించింది. తాజాగా జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో నేషనల్ అవార్డును క్యాన్సిల్ చేశారు. ఇది కరెక్ట్ కాదంటూ ఇప్పటికే జానీ మాస్టర్ తరఫున కొంతమంది మాట్లాడగా, తాజాగా అనీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడింది. అయితే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న అనీ మాస్టర్ (Anee Master) ఇప్పుడు స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని ఖండించడం వెనక ఓ స్టార్ హీరో హస్తం ఉందని ప్రచారం జరుగుతుంది. అదికూడా అల్లు అర్జున్ అంటే పడని హీరో అని టాక్ నడుస్తోంది. మరి ఆ హీరో ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాగా మరోవైపు జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్ గూడా జైలులో రిమాండ్ లో ఉన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×