Anil Ravipudi – Chiranjeevi:అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ఈ డైరెక్టర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా అడుగుపెట్టిన రోజు నుంచి.. మొదట హీరోని ఎంచుకొని, ఆ హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా కథను రాసుకుంటూ.. ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా, కామెడీ జానర్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ముఖ్యంగా హీరో ఇమేజ్ ని బట్టి అలాంటి కథలే రాసుకుంటున్న అనిల్ రావిపూడికి, వరుసగా విజయాలు కూడా తలుపు తడుతున్నాయని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి ఈ ఏడాది “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత.. అనిల్ రావిపూడి ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా హిట్ కొట్టడం వేరు, హీరో ఇమేజ్ ను పట్టుకొని దానికి తగ్గట్టుగా కథలు రాసుకొని హిట్ కొట్టడం వేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.
హీరో ఇమేజ్కి తగ్గట్టే కథ..
ఇక ఈ క్రమంలోని దాదాపు 25 ఏళ్ల తర్వాత వెంకటేష్ (Venkatesh) తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేసి ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి సక్సెస్ అందుకున్నారు. అటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే ముందు కూడా బాలకృష్ణ(Balakrishna) తో ‘భగవంత్ కేసరి’, రవితేజ (Raviteja) తో ‘రాజా ది గ్రేట్’, మహేష్ బాబు(Maheshbabu) తో ‘ సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలన్నీ కూడా హీరో ఇమేజ్ కి తగ్గట్టుగానే కథలు రాసుకొని హిట్ కొట్టారు అనిల్ రావిపూడి.ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విషయంలో కూడా అదే స్ట్రాటజీని అప్లై చేయబోతున్నట్లు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కి బాగా కలిసి వచ్చిన ద్విపాత్రాభినయం అనే కాన్సెప్ట్ తో సినిమా కథను రాసుకుంటున్నారట.
Madraskaaran OTT: తెలుగు ఓటీటీలో నిహారిక మూవీ స్ట్రీమింగ్.. ఎప్పుడు,ఎక్కడంటే?
అనిల్ రావిపూడి – చిరంజీవి మూవీ స్టోరీ లీక్..
వాస్తవానికి చిరంజీవి కెరియర్ మొదటి నుంచి ద్విపాత్రాభినయం పాత్రలు ఆయనకు బాగా కలిసి వచ్చాయి. ‘యముడికి మొగుడు’, ‘దొంగ మొగుడు’, ‘రౌడీ అల్లుడు’ లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచి, చిరంజీవి ఇమేజ్ ను అమాంతం పెంచేశాయి. ఇక రీ ఎంట్రీలో వచ్చిన ‘ ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు చిరంజీవి. ఇక అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా ‘రౌడీ అల్లుడు’, ‘దొంగ మొగుడు’ లాంటి చిత్రాల తరహాలో ఉంటుందని చిరంజీవి ఇప్పటికే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారని పక్కా కన్ఫర్మేషన్ లభిస్తోంది. ఒకటి మాస్, మరొకటి కామెడీ అని తెలుస్తోంది.ఇక రెండు కలిస్తే వింటేజ్ మెగా ఎంటర్టైన్మెంట్ ఖాయం.
మే నెల నుంచి షూటింగ్ ప్రారంభం..
ఇక ఈ ఏడాది మే నెల నుంచి అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబో సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా కథలు రాసుకొని మంచి విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి.. మరి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా కథను రాసుకొని, చిరంజీవితో మరి ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తారో చూడాలి. ఇక అటు చిరంజీవి కూడా సరైన సక్సెస్ కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. మరొకవైపు ఈయన వశిష్ట (Vassistha) దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల అయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ సెట్ లోకి అడుగుపెట్టనున్నారు చిరంజీవి.