Anil Ravipudi: సినీ సెలబ్రిటీలు ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. కొందరు టైటిల్స్ విషయంలో, కొందరు రిలీజ్ డేట్స్ విషయంలో ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయకుండా ఫాలో అవుతూనే ఉంటారు. అలాగే యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలను సరిగ్గా గమనిస్తే తను ఎక్కువగా తన సినిమాలను సంక్రాంతికే విడుదల చేయడానికి ఇష్టపడతాడేమో అనిపిస్తుంది. పైగా అలా విడుదలయిన సినిమాలు కూడా తనను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. ఇప్పటికే 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రెడీగా ఉన్న అనిల్.. అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతికి ఏం చేయాలో ప్లాన్ చేసి పెట్టుకొని ఇతర దర్శకులకు షాకిస్తున్నాడు.
సంక్రాంతే టార్గెట్
దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి అనిల్ రావిపూడి కెరీర్‌లో ఒక్క డిశాస్టర్ కూడా లేదు. పైగా ఎక్కువగా ఫ్యామిలీ స్టోరీస్, కామెడీ కథలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు, దగ్గరయ్యాడు. పలువురు ప్రేక్షకులు అనిల్ రావిపూడి సినిమాలను ట్రోల్ చేసినా చాలామంది మాత్రం తన సినిమాలను ఇష్టపడి చూస్తారు. అలా తన హిట్ హీరో వెంకటేశ్‌తో కలిసి మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జనవరి 14న ఈ మూవీ హిట్ కానుంది. ‘గేమ్ ఛేంజర్’ లాంటి పాన్ ఇండియా మూవీతో పోటీపడుతున్నా కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’పై కూడా చాలా బజ్ క్రియేట్ అయ్యింది.
Also Read: ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.! ఇప్పటికీ రిచ్చే.!
పూజా కార్యక్రమం
జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు రాగానే జనవరి 15న మరొక పెద్ద విషయాన్ని ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి. వెంకటేశ్ తర్వాత తను చిరంజీవి (Chiranjeevi) లాంటి మరొక సీనియర్ హీరోతో సినిమా తీస్తున్నాననే విషయాన్ని ఇప్పటికే బయటపెట్టాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లుందని కూడా ఇటీవల అప్డేట్ అందించాడు. కానీ అనూహ్యంగా అప్పుడే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ పూజా కార్యక్రమం చేసుకునే వరకు వచ్చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో విడుదలయిన మరుసటి రోజే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారట మేకర్స్.
కచ్చితమైన రిలీజ్
2025 సంక్రాంతికి చిరుతో మూవీ ప్రారంభించి, 2026 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి (Anil Ravipudi). మొత్తానికి అనిల్ ప్లానింగ్ కరెక్ట్‌గా ఉంటుందని, తను ఒక విడుదల తేదీని అనౌన్స్ చేశాడంటే కచ్చితంగా ఆ తేదీకి సినిమా విడుదల చేసి చూపిస్తాడని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. మామూలుగా షూటింగ్ మొదలవ్వగానే ఆ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాడు అనిల్. ఎట్టి పరిస్థితిలోనూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ సినిమాను అదే రోజు విడుదల చేసి చూపిస్తాడు. ఇప్పుడు వెంకటేశ్ లాగానే చిరంజీవి కెరీర్‌లో కూడా గుర్తుండిపోయే ఫ్యామిలీ సినిమాను సిద్ధం చేశాడట ఈ యంగ్ డైరెక్టర్.