BigTV English

Anil Ravipudi: ఖచ్చితంగా సంక్రాంతికి వస్తారు

Anil Ravipudi: ఖచ్చితంగా సంక్రాంతికి వస్తారు

Anil Ravipudi: పటాస్ సినిమాలో తెలుగులో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అనిల్ కి వచ్చాయి. అనిల్ కెరియర్లో ఇప్పటివరకు ఒకటి కూడా డిజాస్టర్ సినిమా అంటూ లేదు. రీసెంట్ గా భగవంత్ కేసరి సినిమాతో కూడా అద్భుతమైన హిట్ అందుకున్నాడు అనిల్. అయితే ఇప్పటివరకు అనిల్ తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసాడు. ఈ బ్యానర్ లో దిల్ రాజ్ సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. అనిల్ రావిపూడి కి దిల్ రాజ్ కి ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఎక్కువ సినిమాలు ఆ బ్యానర్ లో చేశాడు అనిల్.


సాయి దుర్గ్ తేజ్ హీరోగా నటించిన సినిమా సుప్రీమ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన నిర్మించారు. అయితే ఈ సినిమా హిట్ అయిన తర్వాత వరుస అవకాశాలను అనిల్ రావిపూడి కి ఇచ్చాడు దిల్ రాజు. రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్ 3 వంటి సినిమాలు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో చేసాడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు రాజమౌళి కెరియర్ లో ఒక ప్లాప్ సినిమా ఎలా అయితే లేదు అలానే అనిల్ కెరియర్ లో కూడా ప్లాప్ సినిమా లేదు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అని సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు.

మామూలుగా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు గురించి కొన్ని నెలల నుంచి డిస్కషన్ మొదలవుతుంది. అయితే మామూలుగా అన్నిటికంటే ముందు విశ్వంభర సినిమా జనవరి 10న వస్తుంది అని అనౌన్స్ చేశారు. కానీ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్ సినిమా అదే డేట్ కి వస్తుంది. కేవలం ఆ సినిమా కోసమే చిరంజీవి సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతికి ఖచ్చితంగా దిల్ రాజు సినిమా ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ సంక్రాంతికి మాత్రం దిల్ రాజు సినిమాలు రెండు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న గేమ్ చేంజర్ తో పాటు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ కానుంది. వెంకటేష్ సినిమా సంక్రాంతి వస్తుందా,రాదా కొన్ని రోజుల క్రితం వరకు డిస్కషన్ జరిగాయి. కానీ దర్శకుడు ఈ డేట్ కోసం దాదాపు పది నెలల నుంచి వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది అలానే పగలు రాత్రి అని తేడా లేకుండా ఈ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అంతా కష్టపడుతుంది ఏదేమైనా ఖచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి వచ్చి తీరుతుంది అని విశ్వసినీయ వర్గాల సమాచారం.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×