BigTV English

Hyderabad: హైదరాబాద్ లోఅంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం, ఎప్పటి నుంచి అంటే?

Hyderabad: హైదరాబాద్ లోఅంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం, ఎప్పటి నుంచి అంటే?

హైదరాబాద్ లో మొట్టమొదటిసారి అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవాలు జరగనున్నాయి.  నాటకరంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో.. ప్రముఖ నటనా శిక్షణ సంస్థ  నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా ఈ వేడుకలను నిర్వహించబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నటి ఫరియా అబ్దుల్లా, ప్రముఖ నటుడు అనీష్ కురువిల్ల, డైరెక్టర్లు వినయ్ వర్మ, వెంకట్ గౌడ, రచయిత ఆకెళ్ళ శివ ప్రసాద్ హాజరు కానున్నారు.


ఇవాళ్టి నుంచి బాలల నాటక ఉత్సవాలు

బాలల నాటక ఉత్సవాల్లో కోల్ కతా, భోపాల్, కేరళ ప్రాంతాల నుంచే కాకుండా నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు బాలల నాటక ఉత్సవాల్లో పాల్గొననున్నాయి. హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు( ఏప్రిల్ 7 నుంచి 9 వరకు)  జరగనున్నాయి. ఈ వేడుకల్లో చిన్నారులు థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలు చేయనున్నారు. ఈ వేడుకల కోసం రవీంద్ర భారతి అద్భుతంగా ముస్తాబైంది.


సృజనాత్మకత, సాంస్కృతిక విలువలు పెంపొందించేలా!

కొత్తతరం కళాకారుల్లోని సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటకాలు ప్రదర్శితం కానున్నాయి. నాటక ప్రదర్శన కళలను ప్రోత్సహించడంలో  ముందుండే నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా ఈ ఈవెంట్‌ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నది. “స్వీయ వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, కళలపై పట్టు సాధించడానికి నాటక రంగం ఓ శక్తివంతమైన సాధనం. విభిన్న సంస్కృతుల నుంచి యువ కళాకారులను ఓ చోట చేర్చడం ద్వారా కొత్తతరం నాటక ప్రేమికులను ప్రోత్సహించాలని భావిస్తున్నాం” అని నిర్వాహక బృందం సభ్యురాలు దేవికాదాస్ వెల్లడించారు.

Read Also: వీధి కుక్కలు ఉండాలి.. లేకపోతే ఎన్ని నష్టాలో చూడండి – తాజా స్డడీలో షాకింగ్ విషయాలు!

నేటితరానికి రంగస్థల ఆవశ్యకతను గుర్తు చేసేలా!

నేటితరానికి రంగస్థల ఆవశ్యకతను గుర్తు చేసేలా ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. “అంతర్జాతీయ స్థాయిలో రంగస్థలంపై చిన్నారులు చేసే మ్యాజికల్ పర్ఫామెన్స్ వీక్షించడానికి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఈ ఈవెంట్ అందిస్తోంది. కళ్లు చెదిరే నాటక ప్రదర్శనలు, అలరించే కార్యక్రమాల సమ్మేళనంతో మొదటి అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం.. ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమంగా నిలువబోతోంది. నేటితరానికి రంగస్థల ఆవశ్యకతను గుర్తుచేసేందుకు ఈ ప్రోగ్రామ్ అన్నివిధాల అనువైన సారథిగా నిలుస్తుందని భావిస్తున్నాం” అని   హరికృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనే చిన్నారులకు పలువురు సినీ ప్రముఖులు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇక ఈవెంట్ షెడ్యూల్, పాల్గొనే గ్రూపుల సమాచారం ఇంకా టికెట్ల గురించి మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్లు, ఈ మెయిల్స్ ద్వారా సంప్రదించండి. 9849256440 , 9971268729, rmholagundi@gmail.com, author.devika@gmail.com

Read Also: మనిషిలా మాట్లాడే కాకి.. నెట్టింట వీడియో వైరల్..

Read Also: వారెవ్వా.. ఈ ఆటో ముందు లగ్జరీ క్యాబ్స్ కూడా దండగే!

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×