Spirit Movie : పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. టాలీవుడ్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్, అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీలో నటిస్తున్నారు ప్రభాస్. త్వరలోనే రాజా సాబ్ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఇక స్పిరిట్ మూవీ గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది..
స్పిరిట్ మూవీ పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. అప్పటినుంచి వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ప్రభాస్ హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్.. తెలుగులో అర్జున్ రెడ్డి, బాలీవుడ్ లో యానిమల్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ మూవీకి దర్శకుడుగా పనిచేస్తున్నారు. పోలీస్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు..
Also Read:ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సినీ కెరీర్ లో తీసుకున్న హైయెస్ట్ రెమ్యూనరేషన్..?
అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలో ఉంది. రీసెంట్ గానే ఈ సినిమాని మెక్సికోలో స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిపిన సందీప్ ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు. స్పిరిట్ సినిమా మంచి ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగే సబ్జెక్టు అని కన్ఫర్మ్ చేసాడు. దీంతో ఇప్పటివరకు యాక్షన్ మూవీ అనుకున్న అందరికి షాకిచ్చాడు డైరెక్టర్. భారీ యాక్షన్స్ అన్నివేశాలతో పాటు ఇదొక థ్రిల్లర్ కాన్సెప్ట్ అని బయట పెట్టాడు. ఈ విషయం విన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీలో డార్లింగ్ ఎలా ఉంటాడో అని ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమా భారీ అంచనాలనే క్రియేట్ చేసుకుంది. సందీప్ వంగా సినిమాల్లో ఒక మార్క్ ఉంటుంది. ఈ మూవీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూవీ తర్వాత యానిమల్ 2 మూవీ పై ఫోకస్ చేస్తాడని తెలుస్తుంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ చేతిలో ఎప్పుడూ అరడజను సినిమాలు ఉంటాయి. కానీ సంవత్సరానికి ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఈ ఏడాది మొదటిసారి మారుతి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న రాజా సాబ్ సినిమా విడుదల కాబోతుంది. అలాగే ఫౌజీ, స్పిరిట్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత కల్కి 2, సలార్ 2 చిత్రాల్లో నటించనున్నాడు.