BigTV English

Animal Box Office : రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ పై దాడి మొదలుపెట్టిన యానిమ‌ల్..

Animal Box Office : రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ పై దాడి మొదలుపెట్టిన యానిమ‌ల్..
Animal Box Office

Animal Box Office : యానిమ‌ల్ .. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా దీని గురించే తెగ డిస్కషన్ జరుగుతుంది. స్ట్రైట్ తెలుగు సినిమాలకు దీటుగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఫై ఈ చిత్రం ప్రభావం పడుతుంది అని సినీ విశ్లేషకుల అంచనా. దానికి తగినట్టుగానే ఈ చిత్రం తన ప్రీ రిలీజ్ బిజినెస్ ను దంచి కొడుతుంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. రష్మిక కాంబోలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 1 న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ మూవీ తెలుగు వర్షన్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంతో తెలుసా?


ట్రైలర్ రిలీజ్ వరకు ఒక లెక్క.. రిలీజ్ తరువాత ఒక లెక్క అన్నట్టు మారింది యానిమల్ మూవీ పరిస్థితి. ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఈ చిత్రానికి క్రేజ్ భారీగా పెరిగింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కండలు తిరిగి కసిగా ఉన్న రణబీర్ .. బాబీ డియోల్ విలనిజం ఒకపక్క.. వీటన్నిటికీ మించి సందీప్ రెడ్డి టేకింగ్ మరొక పక్క.. మొత్తానికి ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ నెలకొనడంతో బుకింగ్స్ పై దాని ప్రభావం డైరెక్ట్ గా కనిపిస్తోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ స్ట్రీట్ తెలుగు మూవీ లెవెల్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ,ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్. 15 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో డిసెంబర్ 1.. శుక్రవారం నాడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఉన్న హైట్ దృశ్య బ్రేక్ ఈవెంట్ దాటడం ఈ చిత్రానికి పెద్ద కష్టమైన పని కాదు అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ డే 5 కోట్ల వరకు ఈ మూవీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన థియారిటికల్ రైట్స్ దిల్‌రాజు సొంతం చేసుకున్నాడు. ఇక వరల్డ్ వైడ్ ఈ మూవీ మొదటి రోజే వంద కోట్ల వరకు వసూళ్లు చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టిస్తుందని చిత్ర బృందం స్ట్రాంగ్ గా నమ్ముతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పాతిక కోట్లు దాటాయి కాబట్టి.. వాళ్లు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు అని అర్థమవుతుంది. హిందీ తెలుగుతోపాటు ఓవర్సీస్ లో కూడా బాగానే బిజినెస్ జరుగుతే 100 కోట్లు మొదటి రోజు అవలీలగా దాటేయొచ్చు. అందరి అంచనాలపై ఈ చిత్రం ఎంతవరకు నిలబడుతుంది అన్న విషయం రేపటికి తేలిపోతుంది..

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×