BigTV English

Anjali : ముద్దు సీన్ ఎలా ఫీలవుతా అంటే..! అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు..

Anjali : ముద్దు సీన్ ఎలా ఫీలవుతా అంటే..! అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు..

Anjali : తెలుగమ్మాయి అంజలి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కేవలం టాలీవుడ్‌లో కాకుండా మాలీవుడ్‌, కోలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తూ.. బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా ఈ అందాల తార ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్స్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది.


సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సహజంగా వస్తాయని అంజలి పేర్కొంది. అందులో నటించక తప్పదన్నారు. అయితే అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తనకు కాస్త ఇబ్బందిగానే ఉంటుందన్నారు. కానీ కథ డిమాండ్‌ చేస్తే చేయక తప్పదన్నారు.

కొన్ని ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు తన గురించి ఏమనుకుంటాడోనన్న ఆందోళన కలుగుతుందని అంజలి పేర్కొన్నారు. ఇంటిమేట్‌ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేనన్నారు. అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తాని పేర్కొన్నారు. నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే దానికి చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుందని అంజలి చెప్పారు.


అంజలి తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌ గురించి స్పందించారు. కొందరు నా పర్సనల్‌ విషయాల గురించి ఇష్టానుసారంగా రాసేస్తున్నారన్నారు. గతంలో జర్నీ నటుడు జైతో ప్రేమలో ఉన్నానని రూమర్స్‌ క్రియేట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి అయిందని వార్తలు రాశారన్నారు. అవన్నీ రూమర్స్‌ మాత్రమేనని అంజలి కొట్టి పారేశారు. అలాంటి రూమర్స్ గురించి విని నవ్వుకుంటాను తప్ప సీరియస్‌గా తీసుకొనని చెప్పుకొచ్చింది.

అంజలి ప్రస్తుతం రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ గేమ్‌ ఛేంజర్‌’ లో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 2014లో ఆమె నటించిన గీతాంజలి సీక్వెల్‌ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. వీటితో పాటు పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×