BigTV English
Advertisement

Tallest Clocktower : ఎత్తైన క్లాక్‌టవర్.. 6 కి.మీ నుంచి చూడొచ్చు..!

Tallest Clocktower : ఎత్తైన క్లాక్‌టవర్.. 6 కి.మీ నుంచి చూడొచ్చు..!

Tallest Clocktower In Dubai : బుర్జ్ ఖలీఫా, మెరీనా 101, ప్రిన్సెస్ టవర్.. ఇలా చెప్పకుంటూ‌పోతే దుబాయ్‌(Dubai)లోని ఆకాశహర్మ్యాల జాబితా ఆంజనేయుడి తోకలా పెరిగిపోతుంది. 150 మీటర్ల ఎత్తు దాటిన ప్రతి కట్టడమూ స్కై‌స్రాపర్ కిందే లెక్క. ఇలాంటి ఆకాశహర్య్మాలు దుబాయ్‌లో 420 ఉన్నాయి. తాజాగా ఎటెర్నిటాస్ టవర్‌‌ను ఆ లిస్ట్‌లోకి చేర్చుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ క్లాక్‌టవర్‌గా అది రికార్డుల్లోకి ఎక్కనుంది.


ఎటెర్నిటాస్ టవర్‌ ఎత్తు 450 మీటర్లు. అంటే 1476 అడుగులు. లండన్ బిగ్‌బెన్ గడియారంతో పోలిస్తే నాలుగింతలు ఎత్తు ఉంటుంది. ఇక న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్క్‌ టవర్ కన్నా 22 మీటర్లు(72 అడుగులు) మాత్రమే ఎత్తు తక్కువ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ బిల్డింగ్‌గా సెంట్రల్ పార్క్ టవర్ రికార్డులకు ఎక్కింది. ప్రపంచంలో రెండో అత్యంత ఎత్తైన క్లాక్‌టవర్ ఇదే కానుంది. సౌదీ అరేబియా మక్కాలోని మక్కా క్లాక్ రాయల్ టవర్ ఇప్పటివరకు టాలెస్ట్ క్లాక్‌టవర్.

దుబాయ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ లండన్ గేట్, స్విస్ విలాసవంతమైన గడియారాల తయారీ సంస్థ ఫ్రాంక్ ముల్లర్ సంయుక్తంగా ఈ టవర్‌ను దుబాయ్ మెరీనాలో నిర్మిస్తున్నాయి. దీని నమూనాను గత వారం దుబాయ్‌లో ఆవిష్కరించారు. 106 అంతస్తులపై గడియారాన్ని ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఇది 6 కిలోమీటర్ల దూరానికి కూడా కనిపిస్తుందని డెవలపర్లు చెబుతున్నారు.


క్లాక్ 49 మీటర్ల(131 అడుగులు) ఎత్తు, 30 మీటర్ల(98 అడుగులు) వెడల్పు ఉంటుంది. టవర్‌లో మొత్తం 649 యూనిట్లను అమ్మకానికి పెడుతున్నారు. ఒక పడక గది నుంచి 3 పడక గదుల వరకు ఉన్న అపార్ట్‌మెంట్లు, విల్లాలు, మాన్షన్ డూప్లెక్స్ వీటిలో ఉన్నాయి. వన్-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ ధర 4.35 లక్షల డాలర్ల వరకు ఉంది. దుబాయ్ మెరీనాలో లగ్జరీ ఫ్లాట్లకు డిమాండ్ ఎక్కువ. పైగా ఇక్కడ భూమి లభ్యత చాలా తక్కువ. అందుకే ఇలాంటి ఆకాశహర్య్మాలకు సంపన్నుల నుంచి ఆదరణ లభిస్తోంది.

గత వారం 30 ఫ్లోర్లలో యూనిట్ల విక్రయాలను ఆరంభించగా.. అప్పుడే 30 శాతం వరకు బుక్ అయ్యాయి. వీటిని 2027 కల్లా రెసిడెంట్స్‌కు అంద జేస్తామని ఎటెర్నిటాస్ డెవలపర్లు చెబుతున్నారు. నిరుడు అక్టోబర్ నాటికి పూర్తయిన భారీ ప్రాజెక్టులు 51 వరకు దుబాయ్‌లో ఉన్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు.

Tags

Related News

Chicago Clashes: ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై నిరసనలు.. చికాగోలో చిన్నారిపై పెప్పర్ స్ప్రే కొట్టిన పోలీసులు

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Big Stories

×