BigTV English

Kubera Update: ఫస్ట్ సింగిల్ త్వరలో.. అప్డేట్ తో హైప్ పెంచేసిన మేకర్స్..!

Kubera Update: ఫస్ట్ సింగిల్ త్వరలో.. అప్డేట్ తో హైప్ పెంచేసిన మేకర్స్..!

Kubera Update: ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో నాగార్జున (Nagarjuna ), ధనుష్(Dhanush ) కాంబినేషన్లో రాబోతున్న చిత్రం కుబేర(Kubera). ఎప్పుడో 2021 జూన్ లోనే అధికారికంగా ఈ సినిమాను #D51 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రకటించారు. ఆ తర్వాత సినిమాలోకి నాగార్జున (Nagarjuna) ఎంటర్ అవడంతో DNS (ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల) గా ఈ సినిమా టైటిల్ మార్చేశారు.అమిగోస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, జిమ్ సర్బ్, దలీప్ తహిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా.. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.


కుబేర మూవీ నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్..

ఇక ప్రస్తుతం కుబేర అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు విడుదల తేదీకి ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచే సినిమాపై అంచనాలు పెంచేశారు. చిత్ర బృందం. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను త్వరలో రిలీజ్ చేయబోతున్నామంటూ మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. అందులో ధనుష్ ఒక టెంపుల్ ముందు రెండు చేతులు పైకెత్తి మొక్కుతున్నట్లు మాత్రమే చూపిస్తూ కుబేర ఫస్ట్ సింగిల్ లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ షాట్ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు.


టైటిల్ వివాదాలు..

ఇకపోతే ఏప్రిల్ 2024 లో ఈ సినిమా టైటిల్ ను ప్రకటించగా.. అప్పుడు చిత్ర నిర్మాత కార్మికకొండ నరేంద్ర కుబేర టైటిల్ హక్కులను కలిగి ఉన్నారని, ఆ టైటిల్ తో ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేశానని పేర్కొన్నాడు. అలా ఫిర్యాదు చేసిన ఎవరూ స్పందించలేదు. వెంటనే నరేంద్ర తెలంగాణ ఫిలిం ఛాంబర్ జోక్యం చేసుకొని వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. కానీ ఇక దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు. అలా ఈ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ హక్కులను ధనుష్ టీమ్ సొంతం చేసుకోగా.. ఇప్పుడు జూన్ 20వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ విషయానికి వస్తే.. మొదటి షెడ్యూల్ 2024 జనవరి 17న హైదరాబాదులో ప్రారంభమైంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని ఒక ఆలయానికి షూటింగ్ నిమిత్తం టీం మొత్తం అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇక తర్వాత అలిపిరి ఘాట్ దగ్గర చిత్రీకరణ జరుగుతూ ఉండగా.. ఆలయం వైపు వెళ్తున్న వాహనాలను పోలీసులు, బౌన్సర్లు దారి మళ్ళించారు.. దీంతో ట్రాఫిక్ కూడా ఏర్పడింది. అంతేకాదు ఈ సినిమాను ఇక్కడ షూటింగ్ చేయడానికి ఎవరు అనుమతించారో తెలుసుకోవడానికి ప్రజలు పోలీసులను ప్రశ్నించి, బృందంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పలు వివాదాల నడుమ జూన్లో విడుదల కాబోతోంది. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Varsham Re release: 21 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ప్రభాస్ వర్షం మూవీ.. ఎప్పుడంటే..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×