BigTV English

Coolie Movie : కూలీ తెలుగు రైట్స్… చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

Coolie Movie : కూలీ తెలుగు రైట్స్… చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున

Coolie Movie : కోలీవుడ్ స్టార్ హీరో రజినీ కాంత్ ( Rajinikanth ) ప్రస్తుతం నటిస్తున్న సినిమా కూలీ.. ఈ మూవీ కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. జైలర్ భారీ అంచనాలతో రాబోతున్న ఈ మూవీ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. లోకేష్ కనకరాజు (lokesh Kanakraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున( Nagarjunana ) కీలక పాత్రలో నటిస్తున్నాడు. దాంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్టు లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా తెలుగు రైట్స్ పై బజ్ క్రియేట్ అయ్యింది. మరి తెలుగు రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారో చూద్దాం..


కూలీ తెలుగు రైట్స్ ఆ సంస్థకే సొంతం..

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కూలీ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కీలక పాత్రలో నటించారన్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగు రైట్స్ ఏ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంటుందా అని గత కొద్ది రోజులుగా ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ సస్పెన్స్ కు తెర పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీ తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తుంది.. ఆగష్టు 14 న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చెయ్యనున్నారు.


నాగార్జున చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పిస్తూ వస్తున్నాయి. ఈ మూవీలో రజినీ హీరో అయితే, నాగార్జున విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా కీలకంగా మారబోతుందట.. అందుకే ఈ మూవీ రైట్స్ ను అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుందని టాక్. అటు టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒక్కటైన సితార ఎంటర్టైన్మెంట్ కూలీ మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు రైట్స్ కోసం బాగానే ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం లేకుండా పోయింది..

Also Read : ‘వార్ 2 ‘లో ఎన్టీఆర్ కంటే హృతిక్ రెమ్యూనరేషన్ అంత తక్కువా..?

అంచనాలను పెంచేసిన టీజర్.. 

రజినీ కాంత్, నాగార్జున నటిస్తున్న కూలీ మూవీ టీజర్ ను ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు. ఒక్క బ్యాక్ షాట్ తోనే నాగార్జున చాలా పాపులారిటిని సంపాదించుకున్నాడు. ఇక గీతాంజలి, రక్షకుడు తర్వాత నాగార్జునకు తమిళంలో కూడా చాలా మంచి ఆదరణ దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ మాత్రం భారీ హిట్ అందుకుంటే నాగార్జున కోలీవుడ్లో చక్రం తిప్పడం ఖాయమని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×