Sharmistha Panoli Influencer| పుణెకు చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్టా పనోలిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మత సామరస్యాన్ని దెబ్బతీసే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించి, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసు కారణంగా శర్మిష్టా చర్చనీయాంశమైంది. ఆమెను విడుదల చేయాలని దేశంలోనే కాకుండా విదేశీ నాయకులు కూడా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం గమనార్హం.
శర్మిష్టా పనోలి ఎవరు?
శర్మిష్టా పనోలి పుణెలోని ఓ లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్య చదువుతున్న విద్యార్థిని. చదువుతూనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా 94,000 మందికి పైగా ఫాలోవర్స్‌ను సంపాదించింది. రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేస్తూ పేరు తెచ్చుకుంది.
వివాదాస్పద వీడియోలో ఏముంది?
ఏప్రిల్ 22, 2025న జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ఆపరేషన్ సిందూర్‌తో ప్రతీకారం తీర్చుకుంది. ఈ అంశంపై ఓ పాకిస్థాన్ యూజర్ శర్మిష్టాకు పలు ప్రశ్నలు వేశాడు. దీనికి ఆగ్రహంతో స్పందిస్తూ, శర్మిష్టా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడుతూ, పహల్గాం ఉగ్రదాడిపై మౌనంగా ఉన్న బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్ రణవీర్ అల్లాహ్‌బాదియాపై విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలు నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. దీంతో శర్మిష్టా క్షమాపణలు చెప్పి, ఆ వీడియోను తొలగించింది.
పోలీసులు ఏమన్నారంటే?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్టా పనోలి అరెస్ట్‌పై విమర్శలు రాగా, కోల్‌కతా పోలీసులు తమ చర్యను సమర్థించారు. ఆమె ఆపరేషన్ సిందూర్‌పై చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లో అగౌరవపరమైన భాష, మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ వీడియోలో బాలీవుడ్ నటులు, ముఖ్యంగా ముస్లిం సెలెబ్రిటీలపై శర్మిష్టా విమర్శలు చేసింది. ఈ వీడియో తీవ్ర వివాదానికి దారితీసి, తర్వాత తొలగించబడింది. ఆ తరువాత ఆమె క్షమాపణ కూడా చెప్పింది.
కోల్‌కతా పోలీసులు ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNSS) కింద చర్యలు తీసుకున్నారు. శర్మిష్టాకు నోటీసు ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేసినా ఆమె అందుబాటులో లేకపోవడంతో, గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమె దేశభక్తిని వ్యక్తం చేసినందుకు కాదు, సామాజిక విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ పోస్ట్ చేసినందుకే అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, దేశ విరోధులకు లబ్ధి చేకూర్చే చర్యలు నివారించాలని పోలీసులు కోరారు.
Kolkata, West Bengal: Kolkata Police arrested a law student Sharmistha Panoli from Pune in Gurgaon for allegedly hurting religious sentiments through social media posts on Operation Sindoor. She was brought to Kolkata on transit remand and produced before the Alipore CJM Court.… pic.twitter.com/jxDpcVSzlJ
— IANS (@ians_india) May 31, 2025
బిజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ఈ అరెస్ట్‌ను రాజకీయ ఉద్దేశంతో చేసినట్లు ఆరోపించారు. శర్మిష్టా ఇప్పటికే వీడియో తొలగించి క్షమాపణ చెప్పినా, అరెస్ట్ చేయడంపై ఆయన తప్పుబట్టారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బిజేపీ ఎంపీ కంగనా రనౌత్ లు కూడా శర్మిష్టాను అరెస్ట్ చేయడంపై బెంగాల్ పోలీసులు, ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
శర్మిష్టాను విడుదల చేయాలని కోరిన డచ్ నాయకుడు
శర్మిష్టా అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆమెను విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారు. డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ ఎక్స్ వేదికగా శర్మిష్టాను ధైర్యవంతురాలిగా పేర్కొంటూ, ఆమె వాక్ స్వేచ్ఛను కాపాడాలని మోదీని కోరారు. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది, మరియు శర్మిష్టా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Free the brave Sharmishta Panoli!
It’s a disgrace for the freedom of speech that she was arrested.
Don’t punish her for speaking the truth about Pakistan and Muhammad.
Help her @narendramodi! @AmyMek #Sharmishta#IStandwithSharmishta #ReleaseSharmistha #FreeSharmishta pic.twitter.com/YhGSLhuyr2
— Geert Wilders (@geertwilderspvv) May 31, 2025