BigTV English

Jani Master : జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్…ఆ ఒక్కటే మాస్టర్ చేసిన మిస్టేక్..?

Jani Master : జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్…ఆ ఒక్కటే మాస్టర్ చేసిన మిస్టేక్..?

Jani Master : ప్రముఖ టాలీవుడ్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గతంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన అసిస్టెంట్ తన పై లైంగిక దాడి చేసాడనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన జానీ మాస్టర్ కేసులో నార్సింగ్ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈవెంట్ ల మహిళలను పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాటుపడినట్లు పోలీసులు నిర్దారించారు.. ఈ కేసు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీని షేక్ చేసింది. మాస్టర్ అరెస్ట్ తరవాత ఆయనను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు పోలీసులు మాస్టర్ దే తప్పు అని తెల్చేశారు. సోమవారం మళ్లీ అరెస్ట్ చేస్తారని సమాచారం.. అయితే మాస్టర్ చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే.. అదేంటో చూద్దాం..


మాస్టర్ పై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలు నిజమనేలా ఛార్జ్ షీట్‌లో పోలీసులు ప్రస్తావించినట్టుగా పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి. ఈవెంట్స్ పేరుతో బాధితురాలిని వేరే ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాల్లో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఇకపోతే ఈ కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్ళనున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి..

అసలేం జరిగింది..? 


తనని లైంగికంగా వేధించాడని ఆయన వద్ద గతంలో అసిస్టెంట్‌గా పనిచేసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తాను మైనర్‌ అని..జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆరోపించారు. పోలీసులు జానీ మాస్టర్‌ పోక్సో యాక్ట్‌తో సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు… జానీ మాస్టర్ ఆచూకీ లభించకపోవడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల తర్వాత గోవాలో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను రిమాండ్ కు పంపించారు. కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వచ్చింది.. మొత్తానికి ఇటీవలే కోర్టు కండీషన్ తో కూడిన బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఆయనదే తప్పు అని పోలీసులు నిర్దారించారు. ఇది యూటర్న్ తీసుకుంది. మాస్టర్ అరెస్ట్ తప్పదా? బెయిల్ రాదా? అనే సందేహాలు జనాలకు మొదలైనట్లు తెలుస్తుంది.

మాస్టర్ అతి పెద్ద మిస్టేక్..? 

ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన పై కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసులు మొత్తానికి జల్లెడ పట్టి అతన్ని గోవాలో అరెస్ట్ చేశారు.. అయితే ఇదే మాస్టర్ చేసిన అతి పెద్ద మిస్టేక్.. కేసు ఉందని తెలిసి కూడా మాస్టర్ పారిపోయారు. ఇక మరో మిస్టేక్ ఏంటంటే మాస్టర్ నమ్మించి మోసం చెయ్యడం.. ఇన్ని రోజులు వేదిస్తున్నా బయట చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పింది..? ఏదైనా ఉంటే ఇద్దరు తేల్చుకోవాలి ఇలా బయటపెట్టడం ఏంటి? ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.. మరి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×