Fauji : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మితమవుతున్న భారీ ప్రాజెక్టులలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ ఒకటి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా టైటిల్ ను ప్రకటించలేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సీతారామం వంటి హిట్ సినిమా తర్వాత హను చేస్తున్న సినిమా కావడంతో చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. గతంలో ఈ ప్రాజెక్టు నానితో చేయాలి అని హను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాను ప్రభాస్ తో చేస్తున్నారు.
గోడ దూకి షూటింగ్ కి హాజరయ్యారు
కొంతమందికి సినిమా మీద విపరీతమైన డెడికేషన్ ఉంటుంది. ఫౌజీ సినిమాలో చాలామంది పెద్దపెద్ద నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే.ఫౌజీ సినిమాలో అనుపమ్ ఖేర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు.ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ షూట్ కోసం అనుపమ్ ఖేర్ హైదరాబాద్‌కి వచ్చారు. షూటింగ్ కి వెళ్తున్న దారిలో, డ్రైవర్ దారి తప్పారు. కారు రివర్స్ సాధ్యం కాలేదు. కాంపౌండ్ వాల్ పక్కనే షూటింగ్ జరుగుతుండటంతో యూనిట్ సభ్యులు నిచ్చెన సాయంతో ఆయనను లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా మీద ఆయనకు ఉన్న డెడికేషన్ గురించి సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో విడుదల కానున్నాయి.
కార్తికేయ 2 సినిమాతో మంచి గుర్తింపు
కొన్ని సినిమాలు మామూలుగా వచ్చి అద్భుతమైన సక్సెస్ సాధిస్తాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన సినిమా కార్తికేయ 2. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని కృష్ణుడి డైలాగ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అనుపమ్ ఖేర్ చెప్పిన కొన్ని డైలాగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాయి. అక్కడితో అతనికి వరుసగా అవకాశాలు తెలుగులో కూడా రావడం మొదలయ్యింది. ఇది ఈ సినిమాకు సంబంధించి మొదట ఈ సీన్ లో మాత్రమే దర్శకుడు రాసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ సినిమా తర్వాత నిఖిల్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం నిఖిల్ కూడా వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు.
Also Read : AMB cinemas : బెంగళూరు అండ్ చెన్నైలో మహేష్ బాబు థియేటర్స్