Fauji..ఫౌజీ (Fauji).. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) హీరోగా ‘సీతారామం’ డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ ఒక సినిమా తర్వాత మరొక సినిమా ప్రకటిస్తూ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మారుతి(Maruthi ) దర్శకత్వంలో ‘రాజా సాబ్’ సినిమా చేస్తున్న ఈయన.. మరొకవైపు ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. ఇందులో బాలీవుడ్ స్టార్ అనుపమ్ ఖేర్ (Anupam kher) తో పాటు ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) కూడా భాగమైనట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రాహుల్ రవీంద్రన్ తెలిపారు.
ప్రభాస్ మూవీలో ఇద్దరు స్టార్స్ ..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. తన లుక్ గురించి తెలిపారు. “నేను హను రాఘవపూడి సినిమాలో నటిస్తున్నాను. అందుకోసమే ఈ లుక్ కొనసాగిస్తున్నాను” అంటూ రాహుల్ రవీంద్రన్ తెలిపారు. మొత్తానికైతే ఈ హీరో ఇప్పుడు ప్రభాస్ సినిమాలో భాగం కావడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరొకవైపు ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా భాగమయ్యారు. ఇందులో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాదు ఈ సినిమాలో వీరితోపాటు ఇంకా భారీ తారాగణం ఉండే అవకాశాలు ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు.
సౌత్ లోనే సెటిల్ అవుతారా?
ఇకపోతే అనుపమ్ ఖేర్ ఇందులో నటిస్తున్నారు అని తెలియడంతో పలువురు నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపై టాలీవుడ్ లోనే సెటిల్ అయ్యేటట్టు ఉన్నారే అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ సీనియర్ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. నటుడు మాత్రమే కాదు దర్శకుడు , నిర్మాత కూడా.. గత నాలుగు దశాబ్దాల కెరియర్ లో 540కి పైగా చిత్రాలలో నటించిన ఈయన.. తెలుగులో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారారు.’ కార్తికేయ 2′ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు ఎక్కువగా సౌత్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఫౌజీ సినిమాలో కూడా భాగమయ్యారు. ఇక మొత్తానికి అయితే ఈయన వాలకం చూస్తుంటే ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ సౌత్ లోనే సెటిల్ అయ్యేటట్టు ఉన్నారే అని నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ: Mrunal Thakur: రహస్యంగా మృణాల్ పెళ్లి.. ఫోటోలు వైరల్!
ఫౌజీ సినిమా విశేషాలు..
ఫౌజీ సినిమా విషయానికి వస్తే.. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఒక విభిన్నమైన కథతో, భారీ బడ్జెట్ తో రాబోతోంది. ఇక ప్రభాస్ కి జోడిగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి(Imanvi ) హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించనున్నారు. 1940వ దశకంలో జరిగే కథగా మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఒక యోధుడు చేసే పోరాటం గానే ఈ సినిమా రాబోతోంది. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి ఈ కథనం సిద్ధం చేశారు డైరెక్టర్ హను రాఘవపూడి.