Srinidhi Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు సుకుమార్(Sukumar) ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఆర్య సినిమాతో తన సినీ కెరియర్ మొదలుపెట్టిన సుకుమార్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు. అల్లు అర్జున్ తో ఈయన పుష్ప (Pushpa)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుతుంది.
ఈ సినిమా తర్వాత సుకుమార్ పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో ఓ సినిమాకి కమిట్ ఆయన విషయం తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan)బుచ్చి బాబు దర్శకత్వంలో “పెద్ది”(Peddi) అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కే జి ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) నటించబోతున్నారని సమాచారం.
శ్రీనిధి శెట్టి…
కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీనిధి శెట్టి అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఈమె నాని నటించిన హిట్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా తెలుగు, కన్నడ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న శ్రీనిధి ఏకంగా రామ్ చరణ్ తో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తోది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.
పెద్ది పైనే ఆశలు..
ఇప్పటికే శ్రీనిధి కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో కూడా ఈమెకు మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలోనే సుకుమార్ ఈమెను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇక రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ఇదివరకు రంగస్థలం (Rangasthalam) వంటి బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా అని తెలియగానే సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. చరణ్ చివరిగా గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెగా అభిమానుల ఆశలన్నీ పెద్ది సినిమా పైనే ఉన్నాయి.