Happy Birthday Sharwanand : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో మంచి టాలెంటెడ్ ఉన్న నటుడు అంటే టక్కును గుర్తొచ్చే పేరు శర్వానంద్. ఇప్పటివరకు శర్వానంద్ చాలా సినిమాలు చేశాడు. వాటిలో అందరికీ గుర్తుండిపోయి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందర్నీ ఆకట్టుకునే కంటెంట్ బేస్డ్ సినిమాలు కూడా ఉన్నాయి. అలానే నిరాశపరిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే శర్వానంద్ ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలామందిని తన మాటలతో తన వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటారు.
శర్వానంద్ హీరోగా కంటే ముందు కొన్ని సినిమాల్లో కనిపిస్తూ చిన్న చిన్న పాత్రలను పోషించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలు శర్వానంద్ చేసిన రోల్ మంచి గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎట్టకేలకు అమ్మ చెప్పింది అనే సినిమాతో కంప్లీట్ హీరోగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శర్వా. క్రిష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయమైన గమ్యం సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు శర్వానంద్. ఆ సినిమాలో శర్వానంద్ నటించిన తీరు అద్భుతమని చెప్పొచ్చు. అక్కడితో శర్వానంద్ కి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే శర్వానంద్ చేసిన ప్రస్థానం సినిమా ఎప్పటికీ మర్చిపోలేము. దేవకట్ట దర్శకుడుగా పరిచయమైన ఆ సినిమాలో శర్వానంద్ అందించిన పర్ఫామెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు.
ఆ తర్వాత మధ్య మధ్యలో కొన్ని సినిమాలు నిరుత్సాహపరిచిన కూడా ఎక్స్ప్రెస్ రాజా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రన్ రాజా రన్ వంటి సినిమాలు శర్వానంద్ కి సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే చాలా డిజాస్టర్స్ తర్వాత శర్వానంద్ నుంచి వచ్చిన సినిమా “ఒకే ఒక జీవితం” ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయింది. మంచి హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ తో పాటు టైం ట్రావెల్ ను కూడా చూపించటం చాలా అద్భుతంగా అనిపించింది ప్రేక్షకులకి.
శర్వానంద్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా బాగా గుర్తుపెట్టుకునే సినిమాలు అంటే గమ్యం, ప్రస్థానం,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాలను చెప్పొచ్చు. శర్వానంద్ కి విపరీతమైన టాలెంట్ ఉంది. కానీ కథలను ఎంచుకునే విధానంలో ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది చెప్పాలి. ఆఫ్ స్క్రీన్ లో శర్వానంద్ ఎలా ఉంటారో చాలా ఇంటర్వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. చాలామంది అవి చూసినప్పుడు ఇంత మంచి హీరోకి సరైన హిట్ సినిమా పడుంటే చాలా బాగుంటుంది అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. శర్వానంద్ కు టాలీవుడ్ లో రానా, రామ్ చరణ్ తో మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. హిట్ సినిమాలు ఎంచుకొని కెరీర్లో ముందుకు వెళితే శర్వానంద్ ఫ్యాన్ బేస్ ఇంకా పెరుగుతుంది. అలా మంచి సినిమాలను ఎంచుకొని ప్రేక్షకులకు మరింత చేరువు అవ్వాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.
Also Read : Devara 2: ‘దేవర 2’ అప్డేట్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ బొనంజా..