Anushka Ghaati: కన్నడిగురాలైన అనుష్క శెట్టి(Anushka Shetty)కి తెలుగులో ఆఫర్ చాలా విచిత్రంగా అందుకుంది. మొదట్లో సినిమాల్లోకి రావాలని ఎంతగానో ఆశపడ్డ అనుష్క శెట్టికి చాలా చోట్ల నిరాశే మిగిలిందట. ఆ తర్వాత యోగ టీచర్ గా మారిపోయింది. ఇక అదే టైంలో జిమ్లో అనుష్కని చూసిన సోనూ సూద్ (Sonusood) సూపర్ మూవీ(Super Movie)కి రిఫర్ చేశారు. అలా సూపర్ సినిమాలో అనుష్క శెట్టికి సోనుసూద్ కారణంగా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా చేశాక టాలీవుడ్ లో అనుష్కకి తిరుగు లేకుండా పోయింది.వరుస సినిమాలు చేస్తూ తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నిశ్శబ్దం, సైజ్ జీరో చిత్రాల తర్వాత ఇండస్ట్రీకి దూరమై.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr.Polishetty) మూవీతో రియంట్రీ ఇచ్చింది..ఈ సినిమా తర్వాత చాలా రోజులకు ‘ఘాటి’ అనే సినిమాని అనౌన్స్ చేసింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ఘాటి(Ghati) అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కుతోంది.
నిజమైన కథతో ఘాటీ..
ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల తేదీని ఫిక్స్ చేయడంతో షూటింగ్ ని శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్. అయితే ఘాటి మూవీ కోసం అనుష్క ఎవరు చేయని ఎన్నో స్టంట్ లు చేస్తున్నట్టు తెలుస్తోంది. యాక్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్నీ చాలా నేచురల్ గా రావాలని, తన పాత్ర కోసం ఎవర్ని డూప్ ని కూడా పెట్టకుండా తానే స్వయంగా ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తోందట. అయితే అనుష్క శెట్టి (Anushka Shetty) నటిస్తున్న ఘాటీ మూవీ ఆంధ్రా,ఒడిస్సా బార్డర్లో జరిగిన ఒక నిజమైన సంఘటన. యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న ఘాటి మూవీలో అనుష్క మొదట బాధితురాలుగా కనిపించి, ఆ తర్వాత నేరస్థురాలిగా ఎలా మారుతుంది? అనేది సినిమాలో చూపిస్తారట. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ అయింది. ఇక మిగిలి ఉన్న బ్యాలెన్స్ షూటింగ్ కూడా చాలా వేగంగా చేస్తున్నారట. ఆంధ్రా, ఒడిస్సా బార్డర్ లో జరిగిన యదార్థ సంఘటన కాబట్టి దీన్ని ఆ లొకేషన్లలోనే తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల కోసం మావోయిస్టులు ఉండే ప్రాంతమైనటువంటి దంతెవాడలో షూటింగ్ జరుపుతున్నారట.
రిస్క్ చేస్తున్న అనుష్క..
మావోయిస్టులు తిరుగుతున్న ప్రాంతంలో ఎలాంటి భయం లేకుండా డైరెక్టర్ క్రిష్ (Director Krish),అనుష్క ఇద్దరు చాలా ధైర్యంగా సినిమా షూటింగ్ చేయడంతో రిస్కీ ప్రాంతంలో అనుష్క షూటింగ్ చేస్తున్నట్టు సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే అటవీ నేపథ్యంలో జరిగే కథ కాబట్టి ఇందులో యాక్షన్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటి కోసం ఇప్పటికే అనుష్క శిక్షణ తీసుకొని డూప్ లు లేకుండానే స్టంట్స్ చేస్తోందట. ఇక అనుష్క టాలెంట్ చూసి ఫిదా అవుతున్నారట చిత్ర యూనిట్. యాక్టింగ్ విషయంలో తగ్గేదేలే అన్నట్టు అనుష్క ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని యాక్టింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దంతెవాడలో షూటింగ్ జరుపుకుంటున్న ఘాటీ మూవీ(Ghaati Movie)కి సంబంధించి ఫిల్మ్ సర్కిల్స్ లో చాలా వార్తలు వినిపిస్తున్నాయి. అంత రిస్కీ ప్రాంతంలో అనుష్క షూటింగ్ అంటే మామూలు విషయం కాదు. అది కత్తి మీద సాములంటి వ్యవహారం అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే రియల్ స్టోరీ కాబట్టి రియల్ గా జరిగిన లొకేషన్లలో చూపిస్తేనే బాగుంటుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 90% షూటింగ్ కంప్లీట్ అయిందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తర్వాత జరుపుకునే నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది.. ఇక చాలా రోజుల తర్వాత అనుష్క(Anushka) ఘాటీ సినిమాలో నటిస్తుంది. కాబట్టి ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మరి అభిమానుల అంచనాలకు తగ్గట్టే అనుష్క శెట్టి ఘాటి మూవీ ఉంటుందా అనేది చూడాలి.