Matthew Breetzke: పాకిస్తాన్ ట్రై సిరీస్ లో భాగంగా నేడు లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా సౌత్ ఆఫ్రికా – న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టులో స్మిత్ {41}, వియాన్ ముల్టర్ {64} పరుగులతో రాణించారు.
Also Read: Rohit Sharma: ఎక్కువ సిక్సులు బాదిన ప్లేయర్ గా రోహిత్ రికార్డు.. తొలిప్లేయర్ చరిత్ర
ఇక డెబ్యూ ఆటగాడు మ్యాథ్యూ బ్రిట్క్జీ {Matthew Breetzke} 148 బంతులలో 150 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు తరుపున ఆరంభ మ్యాచ్ లోనే 150 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వన్డే అరంగేట్రంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మ్యాథ్యూ బ్రిట్క్జీ {Matthew Breetzke} నిలిచాడు. అలాగే అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ గా మ్యాథ్యూ బ్రిట్క్జీ రికార్డుల్లోకెక్కాడు.
వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు సాధించిన సౌతాఫ్రికా ఆటగాళ్ల వివరాలు చూస్తే.. 2010లో జింబాబ్వేపై కొలిన్ ఇంగ్రామ్, 2016 లో ఐర్లాండ్ పై టెంబా బవుమా, 2018లో శ్రీలంక పై రిజా హెండ్రిక్స్, 2025 లో న్యూజిలాండ్ పై మ్యాథ్యూ బ్రిట్క్జీ {Matthew Breetzke} తమ అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీలు సాధించారు. ఇక తటస్థ వేదికలపై వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన ఆటగాళ్ల వివరాలు చూస్తే..
1992లో శ్రీలంక పై ఆండీ ప్లవర్, 2017 లో శ్రీలంక పై ఇమామ్ ఉల్ హక్, 2018లో ఆస్ట్రేలియాపై ఆబిద్ అలీ, 2021లో ఐర్లాండ్ పై రెహ్మాన్ ఉల్లా గుర్బాజ్, ప్రస్తుతం మాథ్యూ బ్రిట్క్జీ {Matthew Breetzke} . ఇక భారత్ తరపున అరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన వారిలో కేఎల్ రాహుల్ ఉన్నారు.కాగా న్యూజిలాండ్ – సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విషయానికి వస్తే.. ఇతర సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు బవుమా {20} మినహా ఇతర ఏ బ్యాటర్ పది పరుగులకు మించి రాణించలేదు.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 కంటే ముందే అన్ని స్టేడియాలకు బీసీసీఐ కొత్త కండిషన్స్ !
న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, ఓరూర్కి చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రాస్ వెల్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 9.5 ఓవర్ లో 50 పరుగుల వద్ద తొలి వికెట్ విల్ యంగ్ {19} ని కోల్పోయింది. ప్రస్తుతం కాన్వే {86*}, కేన్ విలియమ్ సన్ {82*} పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 కి సంబంధించి మెగా వేలంలో మాథ్యూ బ్రిట్క్జీ ని లక్నో సూపర్ జెయింట్స్ కేవలం రూ. 75 లక్షలు మాత్రమే ఖర్చు చేసి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ ఆటగాడు అరంగేట్ర మ్యాచ్ లోనే ఏకంగా 150 పరుగులు చేయడంతో లక్నో అభిమానులు.. తమ జట్టుకి ఓ మంచి ఆటగాడు దొరికాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఆటగాడు ఐపీఎల్ 2025 సీజన్ లో ఏ మేరకు రాణిస్తాడో..? వేచి చూడాలి.