Ritu Varma: కొందరు హీరోయిన్లు ముందుగానే ఇండస్ట్రీలో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలో ఆలోచించే అడుగుపెడతారు. కానీ అన్నీ వారు అనుకున్నట్టు జరగవు కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతుంటారు. అలా కాంప్రమైజ్ అవ్వకుండా కెరీర్‌ను ముందుకు నడిపిస్తున్న వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఒక తెలుగమ్మాయి ఎంటర్ అయ్యిందంటే చాలు.. తను కిస్ సీన్స్ చేయదు అని చాలామంది మేకర్స్ ఫిక్స్ అయిపోతుంటారు. అదంతా నిజం కాదని నిరూపించిన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరో తెలుగమ్మాయి రీతూ వర్మ కూడా యాడ్ అయ్యింది.
అలాంటి సినిమాలే
ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది రీతూ వర్మ. అలా అనుకోకుండా వెండితెరపై కూడా హీరోయిన్ అయ్యింది. కానీ హీరోయిన్ అయినప్పటి నుండి వెంటవెంటనే సినిమాలు చేసేయాలి అని తొందరపడలేదు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ, అందులో తన ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది అని ఆలోచించే చిత్రాలను ఎంపిక చేసుకోవడం మొదలుపెట్టింది. అలా తను నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా ఫ్యాన్ బేస్ మాత్రం భారీగా సంపాదించుకుంది. ఇప్పటివరకు తను నటించిన ఏ సినిమాలో కూడా కిస్ సీన్స్‌లో నటించలేదు రీతూ. దీంతో తాజాగా ఇలాంటి సీన్స్‌లో నటించడంపై తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇబ్బందిపడకుండా చేస్తా
ప్రస్తుతం సందీప్ కిషన్ (Sundeep Kishan)తో జోడీకడుతూ తను నటించిన ‘మజాకా’ (Mazaka) మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది రీతూ వర్మ. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో కిస్ సీన్స్‌పై స్పందించింది. ఒకవేళ స్టోరీ డిమాండ్ చేస్తే హగ్, కిస్ సీన్స్‌లో నటించడంలో తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పుకొచ్చింది రీతూ. ఇప్పటివరకు అలాంటి సీన్స్ ఉన్న సినిమాల్లో తనకు అవకాశాలు రాలేదని క్లారిటీ ఇచ్చేసింది. నిజంగానే కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్‌ను ఇబ్బందిపడకుండానే చేస్తానని చెప్పుకొచ్చింది. తనకు అవకాశం రాకపోవడం వల్ల చేయలేదని, అది చూసి ప్రేక్షకులంతా తాను అలాంటి పాత్రలు చేయదని ఫిక్స్ అయిపోయారని తెలిపింది రీతూ వర్మ.
Also Read: హాస్పిటల్ బెడ్‌పై గాయాలతో ఫేమస్ సింగర్.. ఇంతకీ ఏం జరిగిందంటే.?
ఆ ఇమేజ్ వల్లే
ప్రేక్షకులు మాత్రమే కాదు మేకర్స్ కూడా రీతూ వర్మ (Ritu Varma) క్రియేట్ చేసుకున్న ఇమేజ్ చూసి తను ఇంటిమేట్, కిస్ సీన్స్‌లో నటించదని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకే అలాంటి కథలతో తనను అప్రోచ్ అవ్వడానికి ఇష్టపడడం లేదు. కానీ తాజాగా హింట్ ఇచ్చింది కాబట్టి ఇకపై మేకర్స్ కూడా రీతూ వర్మ కోసం అలాంటి సీన్స్ రాస్తారేమో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మొత్తానికి ప్రస్తుతం రీతూ వర్మ క్రియేట్ చేసుకున్న క్లీన్ ఇమేజే తనకు బాగుందని, ఇప్పటివరకు తను చేసిన ప్రతీ పాత్ర ఎంతోకొంత ప్రేక్షకులను ఇంపాక్ట్ చేసిందని ఫీలవుతున్నారు. తను మారకుండా ఇలాగే ఉంటే బాగుంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.